* శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహణ
* కరోనా అనంతరం తొలిసారిగా జిల్లా స్థాయి పోటీలు
* జిల్లా నలుమూలల నుంచి తరలిరానున్న క్రీడాకారులు
* విస్తృత ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు

(గుండా బాలమోహన్ )

శ్రీకాకుళం – జనాసవార్త
————————————
శ్రీకాకుళం జిల్లా స్థాయి 21వ తైక్వాండో పోటీలకు శ్రీకాకుళం నగరం సిద్దమైంది. కరోనా కారణంగా మొత్తం క్రీడా పోటీలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కోవిడ్ కేసులు తగ్గముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే క్రీడల పోటీల నిర్వహణ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఇదే క్రమంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ ముందుకు వచ్చి జిల్లా స్థాయి తైక్వాండో పోటీల నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం వేదికగా ఆదివారం జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో 21వ జిల్లా స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీలు-2021ను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసారు. ఈ పోటీలకి జిల్లా నలుమూలల నుంచి కూడా తైక్వాండో క్రీడాకారులు హాజరు కానున్నారు. నిపుణుల సమక్షంలో జరిగే ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకి మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లను కూడా ప్రధానం చేయనున్నారు. ఆదివారం ఉదయం జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి, యువనేత రామ్ మనోహర్ నాయుడు, తదితరులు హాజరు కానున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే పోటీల ముగింపు, మెడల్స్, బహుమతులు అందజేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నివాస్ ,ఆర్డిఓ కిషోర్ తదితర అధికారులు మాత్రమే పాల్గొనున్నారు. జిల్లా స్థాయి తైక్వాండో పోటీల నిర్వహణ కోసం అసోసియేషన్ ప్రతినిధులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. ఉదయం 6గంటలకే క్రీడాకారులు వేదిక వద్దకు చేరుకోనున్నారు. తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు పోటీలు జరుగ నున్నాయి. కొరేగి,పూమ్ సే విభాగాలలో సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో   బాయ్స్, గర్ల్స్ కి వేర్వేరుగా పోటీలను నిర్వహించ నున్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అచ్చుతరెడ్డి, కోశాధికారి చెరుకూరి వెంకటరమణ తదితరులు కూడా పాల్గొనున్నారు. ఇందుకు సంబందించి వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో నూతన క్రీడా సామాగ్రినంతటిని కూడా సిద్దం చేసారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ పోటీలు ఉత్సాహంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అసోసియేషన్ ప్రతినిధులు పూర్తి చేసారు. క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా చేపట్టారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు హనుమంతు సాయిరాం, తైక్వాండో శ్రీనులతో పాటు ఉపాధ్యక్షులు వైశ్యరాజు మోహన్ ఇతర అసోసియేషన్ ప్రతినిధులు సుధీర్ వర్మ,గిడుతూరు వెంకటేశ్వరరావు(శ్రీను), బలభద్రుని సురేష్ కుమార్ (రాజా), శిక్షకులు నీలంచెట్టి రవి,మజ్జి గౌతమ్, పుక్కళ్ళ నవీన్, అంధవరపు సతీష్, దువ్వు లక్ష్మణ్, రాహుల్, జోగిపాటి వంశీ, నర్శిపట్నం శేఖర్, గోపి, సిహెచ్ దుర్గా ప్రసాద్, తదితరులు ఈ పొటీల విజయ వంతంనకు సర్వం సిద్దం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *