* జాతీయ కుష్టువ్యాధి నివారణ దినోత్సవం

శంఖవరం – తూర్పుగోదావరి జిల్లా
———————————————–
కుష్టు వ్యాధిపై ప్రజల్లో సదవగాహన కల్పించాలని రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్ మెంట్ ట్రస్టు
చైర్మన్ ఎన్.స్లెస్సర్ బాబు పిలుపు ఇచ్చారు.
జాతీయ కుష్టువ్యాధి నివారణ దినోత్సవం సందర్భముగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రెపరల్ హాస్పిటల్ ఆవరణలో బహిరంగ సభను శనివారం నిర్వహించారు.

ఈ బహిరంగ సభలో ప్రజలు, రోగులను ఉద్దేశించి
ముఖ్య అతిధిగా చైర్మన్ స్లెస్సర్ బాబు ప్రసంగించారు. ముందుగా భారత జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ గాంధీ కుష్టు రోగులకు చేసిన సేవని స్మరించుకుని దేశ వ్యాప్తంగా కుష్టు వ్యాధి నివారణా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటామని అన్నారు. తమ రిఫరల్ ఆస్పత్రి సంస్థ తరఫున స్పర్శ అనే ఆరోగ్య కార్యక్రమాన్ని జరుపుకుని ప్రతి గ్రామంలోనూ తమ ఆరోగ్య సిబ్బంది పక్షం రోజుల పాటు ఉచిత సేవా కార్యక్రమంగా కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించి ఈ వ్యాధి నిమిత్తం ప్రజలలో అవగాహనా కలిపిస్తూ ఉంటామని తెలిపారు.

డాక్టర్ సోలమన్ రాజు మాట్లాడుతూ కుష్టు వ్యాధి అంటు రోగం కాదని స్పష్టం చేశారు. ఎండిటి విధానం ద్వారా ఇది పూర్తిగా నయం అవుతుందని అన్నారు. ప్రాధమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని వివరించారు. ఈ వ్యాధి తీవ్రత ఈ మధ్య కాలంలో బాగా తగిందని పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధి సోకిన వారి పట్ల వివక్షత చూప కుండా వారికి వ్యాధి గుర్తించి అవగాహన కిల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 30 మంది కుష్టు వ్యాధి అంగవైకల్యం కలిగిన వారికి ఎమ్సీఆర్ చెప్పులు, వస్త్రాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఆర్.కేశవరావు, ఆర్. ప్రవీణ్ దాస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సోలమన్ రాజు, ఆస్పత్రి సిబంది, కుష్టు వ్యాధి విముక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *