* రెవెన్యూ అధికారులు మా భూములను అన్యాక్రాంతం చేసారు
* బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన

యస్.రాయవరం – విశాఖ జిల్లా
————————————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మండల కేoద్రమైన యస్.రాయవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 156 లోని 1.26 ½ భూమికి, సర్వే నెంబర్ 127/2 లోని 0.07 ¼ భూమికి, యస్.రాయవరం మెయిన్ రోడ్డులో డోర్ నెంబర్ 8-5 వున్న ఇల్లు, కోర్టు తీర్పు, కోర్టు అప్పగింతలు చేసిన తరువాత పలు ఫిర్యాదులు చేసినా, తప్పుడు రిజిస్ట్రేషన్ కు రెవెన్యూ అధికారులు, రెవిన్యూ రికార్డులలో నమోదు చేసి, పాస్ బుక్స్ మంజూరు చేయడంపై విచారించి న్యాయం చేయాలని ఆళ్ల భూలోక నాయుడు, శివ ప్రసాద్, సంతోష్ కుమార్ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలమంచిలి మండలం సోమలింగపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల సూర్యకాంతం కుటుంబ సభ్యులు భూలోక నాయుడు, శివప్రసాద్, సంతోష్ కుమార్, శైలజ సంయుక్తంగా విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమ తల్లి ఆళ్ళ సూర్యకాంతం తండ్రి ఆడారి లక్ష్మణ 01.08.1972 న దస్తావేజులు నెంబర్లు 2983/1972 ద్వారా 0.63¼ సెంట్లు, 2984/1972 ద్వారా 0.63 ¼ సెంట్లు వెరసి మొత్తం 1.26½ సెంట్లు భూమిని లక్కోజు వెంకయ్య కుటుంబ సభ్యుల నుండి కొనుగోలు చేశారన్నారు. ఆడారి లక్ష్మణ, భార్య చింతల్లి దంపతులకు కుమార్తె ఆళ్ల సూర్యకాంతం, కుమారుడు ఆడారి నూకరాజు ఉరఫ్ దివాణం ఉన్నారు. ఆడారి లక్ష్మణ వారసులయిన ఆళ్ల సూర్యకాంతం, సోదరుడు ఆడారి నూకరాజుపై తండ్రి ఆస్తులలో తన వాటా గూర్చి ఎలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాజ్యం I A 69/2002 in O.S No.119/1995 వేయగా కోర్టు అనుకూలంగా సర్వే నెంబర్ 156 లోని 1.26 ½ భూమికి, సర్వే నెంబర్ 127/2 లోని 0.07 ¼ భూమికి, యస్.రాయవరం మెయిన్ రోడ్డులో డోర్ నెంబర్ 8 -5 వున్న ఇంటిని తమ వాటాగా తీర్పు ఇవ్వడం జరిగినదని తెలిపారు. దీని ప్రకారం వారెంటు E.P.No.42/2007 in O.S.No.119/1995 జారీ చేయడమైనదని, దీని ప్రకారం కోర్టు తమ సిబ్బందితో 23.01.2008 న తమకు అప్పగించారని, అయితే ఆరోజు అప్పగింతకు ఎవరూ ఎటువంటి ఆటంకo కలిగించలేదని తెలిపారు.

23.08.2019న ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఈ భూమికి వారసులమని, ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. అయితే అనూహ్యంగా 31.08.2019 న ఎలమంచిలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమంగా యస్.రాయవరం గ్రామ మాజీ సర్పంచ్ లక్కోజు ఆదిమూర్తికి ఆడారి నూకరాజు రిజిస్ట్రేషన్ చేసారని తెలిపారు. 21.10.2019 న స్పందన కార్యక్రమంలో (VSP 201910214584) ప్రకారం విశాఖ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసాం అన్నారు. 01.11.2019 న ఆడారి నూకరాజు, కుమారుడు ఆడారి శ్రీనివాసరావు, మద్దాల వరలక్ష్మి, లక్కోజు ఆదిమూర్తిలకు లాయర్ నోటీసు పంపామని తెలిపారు. ఆ భూములకు ఏవిధమైన భూయాజమాన్య పత్రాలు, పాస్ బుక్స్ మంజూరు చేయవద్దని యస్.రాయవరం తహసీల్దార్ కు 1.11.2019 న ఫిర్యాదు చేసామని, 23.10.2019 న అనూహ్యoగా అప్పటి తహసీల్దార్ కోరాడ వేణు గోపాల్, ఫిర్యాదులు, పత్రాలు ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ చేసి, పాస్ బుక్స్ మాజీ సర్పంచి లక్కోజు ఆదిమూర్తికి నాయకుడు బొలిశెట్టి గోవిందరావు వత్తిడి మేరకు ఇచ్చారని తెలిపారు. ఈ భూమిని లక్కోజు ఆదిమూర్తి అనే బినామీ పేరుమీద బొలిశెట్టి గోవిందరావు కొనుగోలు చేసారన్నారు.

10.12.2019 న విశాఖపట్నం జిల్లా రూరల్ యస్.పికి ఫిర్యాదు (VSP 20191210940) చేయగా అప్పటి యస్.రాయవరం ఎస్.ఐ 23.10.2019 న మమ్ములను, వారిని స్టేషన్కుఞఞ పిలిపించుకొని విచారణ చేసి రిపోర్టు యస్.పి.కి పంపుతానని తెలిపారే తప్ప ఎటువంటి న్యాయం చేయలేదని వాపోయారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కు, అదే విధంగా 18.01.2020 న స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కు పిర్యాదు చేశామని, ఎమ్మెల్యే గొల్ల బాబూరావుని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించగా న్యాయం చేస్తానని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా మని హామి ఇచ్చారని, ఇప్పటికైనా న్యాయం జరుగు తుందని ఆశిస్తున్నా మన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *