దార్లపూడి – విశాఖ జిల్లా
——————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో పట్టా నెం.193 సర్వే నెం. 333/ 3B లో బొల్లం అచ్చన్న ఎకరం భూమికి 02.02.1980 న డి.ఫారం పట్టా ఇచ్చారు. అతను 24.01.2004 న మరణించారు. ఐతే గతంలోనే వేరే వ్యక్తితో వివాహం అయిన బొల్లం శారద నా భర్త బొల్లం అచ్చన్న చనిపోయాడు అంటూ రెవెన్యూ అధికారులను నమ్మించి, వారితో కుమ్మకై తన పేరున రెవెన్యూ రికార్డులను తన పేరున మార్పించుకొని, పాస్ బుక్స్ పొంది, మోస పూరితంగా ఆక్రమించు కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నదని, అదేవిధంగా సర్వే నెం.333/3C లో ఎకరాలు 0.63 సెంట్లు భూమి ఇళ్ల పట్టాల కొరకు ప్రభుత్వం తీసుకొని గారా జోగారావు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయగా ఈ సొమ్మును బొల్లం శారద తను, తన కుమార్తెల బ్యాంకు ఖాతాలలో మళ్ళించుకున్న తరువాత రెండో రోజు మృతి చెందడంపై తమకు పలు అనుమానాలు ఉన్నందున విచారించి తగు న్యాయం చేయాలని బొల్లం వరాలమ్మ, బొల్లం ప్రకాశరావు, చింతా అదిలక్ష్మి కోరుచున్నారు. బొల్లం వరాలమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఎస్.సి కులస్థులమని, రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటామని, కూలి పనుల కొరకు వలస వెళ్తూ ఉంటామని తెలిపారు. తన భర్త బొల్లం అచ్చన్న, బొల్లం రాములు, బొల్లం నూకాలమ్మ కుమారుడు అయితే రాములు మరణానంతరం నూకాలమ్మ గార జోగారావును వివాహము చేసుకొని, తన భర్తను వారసుడుగా చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నందున ఎస్.సి కులస్థులం ఐనందున తన మామ జోగారావు, తండ్రి పెద వెంకన్నకు సర్వే నెం. 333/3D లో ఎ 1.03 సెంట్లు భూమి, అలాగే మామ గారా జోగారావుకు సర్వే నెం.333/3C లో ఎ 0.86 సెంట్లు భూమిని, అలాగే తన భర్త బొల్లం అచ్చన్నకు సర్వే నెం.333/3B లో ఎ 1.00 సెంట్లు భూమిని 02.02.1980 న ప్రభుత్వం డి-ఫారం పట్టాలను మంజూరు చేశారన్నారు. అదే విధంగా తన భర్త బొల్లం అచ్చన్నకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా నెం. 193, సర్వే నెం.333/3B లో ఎ 1.00 సెంట్లు భూమిని నా భర్త మరణాంతరము వేరే వివాహిత మహిళ శారద అప్పటి వి.ఆర్.ఓ రేమాల పార్వతి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆమె పేరున రెవెన్యూ రికార్డులు మార్చివేసి పాస్ బుక్స్ పొందినట్లు తెలిసి, యస్.రాయవరం తహశీల్దారుకి పిర్యాదు చేశామన్నారు. కేంద్ర, రాష్ర్ట్ర ప్రభుత్వం రైతులకు అందచేస్తున్న పారితోషకాన్ని కూడా శారద పొందడం ద్వారా కూడా వారసులైన మాకు అన్యాయం జరుగు తున్నదని బాధితులు వాపోయారు. మా గ్రామంలో ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం వారు సర్వే నెం.333/3C లో ఎ 0.63 సెంట్లు భూమిని ప్రభుత్వం తీసుకొని దానికి సంబందించిన భూమి కొరకు గారా జోగారావు బ్యాంకు అకౌంట్ కు సుమారు రూ.14,00,000 సొమ్ము జమ చేయగా, ఈ సొమ్మును వృద్ధుడైన మామ గారా జోగారావు బ్యాంకు ఖాతా నుండి సొమ్మును శారద అనే మహిళ, ఆమె కుమార్తెలు కలిసి వారి బ్యాంకు ఖాతాలకు సొమ్మును మళ్లించుకున్నారని తెలిపారు. సొమ్ము వాళ్ళ ఖాతాలకు మళ్లించు కున్న తరువాత రెండు రోజులకే మా మామ గార జోగారావు మృతి చెందడంపై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. 08.08.2017న నర్సీపట్నం ఆర్.డి.ఓ,కు పిర్యాదు చేయగా యస్.రాయవరం తహశీల్దార్ కు పంపిన లేఖ పంపారన్నారు. 11.12.2020 న నర్సీపట్నం సబ్ కలెక్టర్ కు 02.01.2021 న విశాఖపట్నం రూరల్
ఎస్.పి, యస్.రాయవరం ఎస్.ఐ కు పిర్యాదు పిర్యాదు చేశామని, ఎమ్మెల్యే గొల్ల బాబూరావుని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించగా న్యాయం చేస్తానని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని, ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *