శంఖవరం – తూర్పు గోదావరి
——————————————-
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలంలో మరో రెండు పంచాయితీల పాలక వర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలోని అచ్చంపేట గ్రామ పంచాయతీ మహిళా జనరల్ రిజర్వుడు స్థానానికి సర్పంచ్ గా బొట్టా చైతన్య, ఎస్.జగ్గంపేట పంచాయితీ ఓసీ జనరల్ రిజర్వుడు సర్పంచ్ గా బైరా ఉప్పారావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అచ్చంపేట గ్రామ పంచాయతీకి బొట్టా చైతన్య ఒక్కరే సర్పంచ్ పోటీ బరిలో ఉండటం, ఎనిమిది వార్డులకు ఎనిమిది మంది వార్డు సభ్యుల అభ్యర్థిత్వాలకు దరఖాస్తులు చేయడం, వేరేవరూ నామినేషన్ దాఖలు చేయకపోడంతో చైతన్య సర్పంచ్ గానూ మిగతా వారు వార్డు సభ్యులుగానూ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవం అయ్యింది. గత ఎన్నికల్లో జి.కొత్తపల్లి పంచాయితీకి కూడా సర్పంచ్ గా బొట్టా చైతన్య సర్పంచ్ గా పోటీలో అత్యధిక ఓట్లతో ఎన్నికై సేవలు అందించారు. ఈమె ఇంటర్మిడియట్ వరకూ చదువుకున్న విద్యా వంతురాలు, మాజీ సర్పంచ్ గా ఈమెకు కొంత పాలనా అనుభవం ఉంది. హోమ్ గార్డ్ శ్రీనివాసరావుకు ఈమె భార్య. గృహిణిగా ఉన్న ఈమెకు ఏ ఇతర వృత్తి, వ్యాపకాలు లేవు. ఈమె ఇద్దరు పిల్లల్లో కౌశిక్ ఆరో తరగతి, లితేష్ ఐదో తరగతి చదువు తున్నారు. ఈమే ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ ప్రసాద్ ఆశీర్వాదంతో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

ఎస్.జగ్గంపేట పంచాయితీ ఓసీ జనరల్ కేటగిరి కింద రిజర్వు కాగా ఈ పాలక వర్గం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. సర్పంచ్ గా బైరా ఉప్పారావు, మరో ఎనిమిది మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అప్పారావు స్థానిక సంస్థల పదవులకు కొత్తే గానీ రాజకీయ కార్యకర్తగా పూర్వానుభవం ఉన్నవారు. ఈయన భార్య నూకాంబరం గృహిణి. వీరి ఇద్దరు పిల్లలు వెంకటసత్యశివ, కుసుమ ఒకటో తరగతి చదువు తున్నారు. ఆరో తరగతి వరకూ చదువుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈయన కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ ప్రసాద్ ఆశీర్వాదంతో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. దీంతో శంఖవరం మండలంలో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యిన పంచాయితీల సంఖ్య మూడుకు చేరింది.

————————————————

విన్నపం :

పైన మీరు చూసిన ఛాయా చిత్రం నిజానికి ఒకటి కాదు. ఏకగ్రీవ సర్పంచ్ లను వేర్వేరు సమయాల్లో  ఎమ్మెల్యే నేడు అభినందిస్తుండగా తీసిన రెండు వేర్వేరు ఛాయా చిత్రాలను ఒకే ఛాయా చిత్రంగా జతచేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *