* నెల్లిపూడికీ అన్నవరం ఎస్సై పిలుపు

నెల్లిపూడి – తూర్పు గోదావరి
———————————————
వివాద రహితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు గ్రామస్థులు ప్రతీ ఒక్కరూ నిజాయితీగా సహకరించాలని ప్రజలకు అన్నవరం ఎస్సై రవికుమార్ పిలుపు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి సమస్యాత్మక గ్రామాన్ని ఎస్సై రవికుమార్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాల పరిశీలనలో భాగంగా ఆయన ఈ గ్రామాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్నికల సక్రమ నిర్వహణపై ఓటర్లు, ప్రజల్లో సదవగాహన కల్పించ డానికి గ్రామంలోని సచివాలయం ఆవరణలో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను తప్పని సరిగా అందరూ విధిగా పాటించాలి, సామరస్య పూర్వక, సుహృద్భావ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి, ప్రజా శాంతికి భంగం కలిగించే రీతిలో గొడవలు, అల్లర్లకు పాల్పడే విధంగా ప్రవర్తించ కూడదని తెలిపారు. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించితే సంబంధిత బాధ్యులపై చట్టబద్ధమైన కఠినమైన క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని ఎస్సై రవికుమార్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *