పశు దాణా కేంద్రాల ఏర్పాటుకు భవనాలను గుర్తించండి

* ఆర్బీకేలను తనిఖీ చేసిన జెడి ప్రసాద్

శంఖవరం – తూర్పు గోదావరి
—————————————–
శంఖవరం, రౌతులపూడి మండలాల్లో పశు దాణా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రభుత్వ ఖాళీ భవనాలను సత్వరం గురించాలని ఈ మండలాల పశు సంవర్ధక శాఖ జెడి ఎన్టీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. శంఖవరం మండలంలోని కత్తిపూడి, నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల (ఆర్బికె)ను బుధవారం అకస్మాత్తుగా ఆయన తనిఖీ చేశారు. ఈ కేంద్రాల్లోని దస్త్రాలను, సిబ్బంది పని తీరును ఆయన పరిశీలించారు. అనంతరం శంఖవరం, రౌతులపూడి మండలాల రైతు భరోసా కేంద్రాలు, పశు సంవర్ధకశాఖల సిబ్బందికి సంయుక్తంగా శంఖవరంలోని రైతు భరోసా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల ప్రయోజనార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “చేయూత పధకం” లో తూర్పు గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల వైఎస్సార్ కాంతి పధకం సిబ్బంది ద్వారా రాయితీపై అందిస్తున్న గేదెలు, రైతు పాడి మేతకు
పశువుల దాణా, మినరల్ మిక్చర్, మాగుడు గడ్డిని రాయితీపై అందించ వున్నదన్నారు. ఈ మేతను నిల్వ ఉంచడానికి భవనాలు అవసరం ఉందన్నారు. అందుకోసం అనవైన ప్రభుత్వ ఖాళీ భవనాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదినచాలని సూచించారు. అందులో అనుకూలమైన భవనాల్లో పశుదాణా గిడ్డంగులను ఏర్పాటు చేస్తారు అని ఆయన వెల్లడించారు. అప్పుడు అందులో దాణా నిల్వ ఉంచుతారన్నారు. ఇకపై పశువైద్య సేవకులు అందరూ రైతు భరోసా కేంద్రాల నిర్వహణ పరిధిలోకి వస్తారని వెల్లడించారు. అందువల్ల పశువైద్య సేవకులు అందరూ బయోమెట్రిక్ హాజరును అనుసరించాలని, ఈ హాజరును జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం ఉన్నత అధికారులకు అంతర్జాలంలో పంపాలని జెడి ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల పశు సంవర్ధక శాఖ వైద్యాధికారి కాకర్ల ప్రసాద్, సహాయకుడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *