శంఖవరం  – తూర్పు గోదావరి
—————————————————

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విలేకరులకు ఇప్పటికయినా అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి, సమాచారం శాఖ అధికారులకు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు వై కా పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రిడిటేషన్ కార్డుల అంశం గాడిలో పడలేదు. ఎన్నో జీవోలు,మెమోలు జారీ అయ్యాయి, ఇంతవరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాదిమంది విలేకరులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయలేదు.రాష్ర్ట వ్యాప్తంగా జర్నలిస్టుల నుండి వస్తున్న ఆందోళనలు కారణంగా పాత కార్డ్స్ రెన్యూవల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే విలేకరుల పట్ల సకాలంలో స్పందించకుండా కాలయాపన చేసిన ఘనత తమ ఖాతాలో వేసుకున్న ప్రభుత్వం, ఇప్పటికైనా తన పొరపాటుని సరిదిద్దుకొని విలేకరుల అక్రిడిటేషన్ కార్డులు రెన్యువల్ చేయుటకు ముందుకు రావటం పట్ల శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణఅంజనేయులు, ప్రధాన కార్యదర్శి మారేళ్ల వంశీకృష్ణ,విజ్ఞప్తి మేరకు రాష్ర్ట సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు… ప్రభుత్వం స్పందించి సోమవారం సాయంత్రం అక్రిడిటీషన్ లు ఏడాది కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల 27 నుండి రెన్యూవల్ కార్డ్స్ అన్ని జిల్లాల సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆమోదం మేరకు జారీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *