మల్లూరు – ములుగు జిల్లా
—————————————-
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన మారబోయిన స్వప్న రాంబాబు ప్రస్తుతం సినీరంగంలో అడుగిడి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ అంచెలు అంచెలుగా ఎదుగు తున్నారు. దీనికి ముందు గతంలో చిన్న వయసులోనే పోరు బాట పట్టి మావోయిస్టుల్లో చేరి 5 సంవత్సరాల పాటు ప్రజా ప్రతిఘటన దళంలో నక్సలైట్ గా పని చేసారు. 2005లో ఖమ్మం డిఎస్పీ దగ్గర ఆమె లొంగిపోయి ప్రభుత్వం ఇచ్చే రూ. 50,000 నగదు ప్రోత్సాహాన్ని అందుకున్నారు. అనంతరం పెళ్లయ్యాక గృహిణిగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన కష్టాలను అదిగమించి రాజకీయంలో అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో అధ్యక్షురాలిగా పని చేసారు. పార్టీ కోసం శ్రమించినా తన బతుకు మారలేదని రాజకీయాల్ని విడచి పెట్టారు. తర్వాత టిక్ టాక్ లో “స్మైలీ స్వప్నగా” ఫేమస్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అనంతరం ఆ గుర్తింపుతో ఓ మిత్రుని సలహా, సహకారంతో బుల్లి తెర రంగంలోకి ప్రవేశించారు. టీవీ సీరియల్లో నటిగా అవకాశం వచ్చి మొదటగా నాలుగు స్తంభాలు సీరియల్లో కానిస్టేబుల్ పాత్రతో  తన నటనను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆమె సుమారు 5 సీరియల్స్ లో  నటించారు. ఇటీవల ఓ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో  నటిస్తూనే మరో రెండు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించడానికి అవకాశం వస్తే స్వప్న అంగీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *