* స్మశానాలు, ఆస్పత్రి అభివృద్ధికి ప్రాధాన్యం
* సంచార తాగు నీటి సౌకర్యం కల్పిస్తా
* సెక్టార్ రిఫార్మ్స్ అవినీతి అంతు తేలుస్తా
* ఊరంతా సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరిస్తా
* ప్రజలు, ప్రభుత్వ అనుసంధాన కర్తగా ఉంటా
* అన్నవరం సర్పంచ్ అభ్యర్థి కుమార్ రాజా హామీ

 (కుమార్ రాజా స్వగృహం నుంచి జనాస)

అన్నవరం – తూర్పు గోదావరి 

న్నవరం మేజర్ గ్రామ పంచాయితీ సమగ్ర అభివృద్ధికి శక్తి మేరకు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన స్వగృహంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు “జనాసవార్త” తో ముుఖా ముఖీగా మాట్లాడారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ ఆశీస్సులు, ప్రోత్సాహంతో సర్పంచ్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను గెలిస్తే గ్రామ సర్వతోముఖ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. 15,000 మంది జనాభా, జాతీయ రహదారి, రైల్వే రవాణా సౌకర్యం, శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, పంపా పోలవరం, పచ్చని పకృతి వంటి విశిష్టతలతో కూడి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ సరైన స్మశాన వాటికలు లేవని, శైశ్య, బ్రాహ్మణ, ముస్లింల వర్గాల మృత దేహాలను పిఠాపురం, రాజమండ్రి, కాకినాడకు తరలించి శవసంస్కారం చేసు కుంటున్న దయనీయ పరిస్థితి ఇక్కడ ఉందని, హిందూ స్మశాన వాటిక చాలా అధ్వాన్నంగా ఉందని ఈ సమస్య పరిష్కారం తన ప్రధాన ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుని గ్రామంలో నూతన స్మశాన వాటికల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కపార్ట్ నిధులను విడుదల చేయించి, ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు, స్థానిక లయన్స్, రోటరీ క్లబ్బులు వంటి సంస్థలు, మేధావులు సలహాలు, సంప్రదింపుల సహకారంతో గ్రామంలో క్రిష్టియన్, ముస్లిం, హిందువులకు వేర్వేరు అధునాతన స్మశాన వాటికలు, వాటికి ప్రహారీ గోడల నిర్మాణం చేస్తామన్నారు. శివ సాన్నిధ్యం చేరిన మృత దేహాలకు ఆహ్లదకర వాతావరణంలో శవ సంస్కారం చేసుకునే పూర్తి స్థాయి సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీనిస్తూ ఇదే నా ప్రధాన విధాన లక్ష్యమని వివరించారు.

ఇక రెండో ప్రధాన విధాన లక్ష్యం విషయానికి వస్తే స్థానిక దేవస్థానం ప్రజా వైద్యశాలను పూర్తి స్థాయి పది పడకల స్థాయికి దేవస్థానం నిధులతో ఉన్నతీకరించి, అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కృత నిశ్ఛయంతో ఉన్నారని, ఈ కృషిలో ఇటు ఎమ్మెల్యే, అటు ప్రభుత్వ అధికారులు, ప్రజలకూ మధ్య సర్పంచ్ గా, అనుసంధానకర్తగా తన వంతు కృషి చేస్తాను అన్నారు. శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న అన్నవరంలో ఇంకా చాలా చోట్ల కాంక్రీట్ సిమెంటు రోడ్లు, మురుగు కాలువలను నిర్మించాల్సి ఉందని, ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తానని కుమార్ రాజా అన్నారు. గ్రామంలో ఎద్దడి ఉన్న చోట్ల ట్యాంకర్లతో తాగు నీటిని పంచాయితీ నిర్వహణలో ఉచితంగా అందించి ఆ సమస్యను అధిగమిస్తా నన్నారు. శుభ కార్యాలు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ నీటీని వినియోగించు కోవచ్చని చెప్పారు. శరవేగంగా జనాభా, గ్రామం విస్తరిస్తున్న స్థాయికి తగిన సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే, ప్రభుత్వ సహకారంతో పెంచి గ్రామం అంతటా సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేయడమే గాక, సిబ్బంది విధులను రోజూ తానే స్వయంగా పర్యవేక్షిస్తాను అన్నారు. పూర్వపు సెక్టార్ రిఫార్మ్స్ పధకంలో దుర్వినియోగమైన నిధులను పంచాయితీకి రాబడతాను అన్నారు. ఊరంతా సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా కల్పించడంలో తాను రాజీ పడనని స్పష్టం చేసారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి తాను కృషి చేసేందుకు తనకు అత్యధిక ఓట్లను వేసి సర్పంచ్ గా గెలిపించి దీవించాలని శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *