* తెదేపాలో 15 సీనియర్లకు విలువ లేదు
* సీనియర్లను విమర్శిస్తోన్న జూనియర్స్
* వరుపుల రాజా వర్గానికే ప్రాధాన్యం
* పార్టీలో ఇమడలేకే వైకాపాలో చేరాం
* వకీలు, టిడీపీ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ రజాల చిట్టిబాబు వెల్లడి

అన్నవరం – తూర్పు గోదావరి
———————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం మాజీ సర్పంచ్ దంపతులు రజాల చిట్టిబాబు, రజాల గంగా భవానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ సమక్షంలో గ్రామంలోని పెద్దలు, మద్దతు దారులతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్టీలో చేరారు. ప్రముఖ వకీలుగా పనిచేస్తూ, మరో వైపు ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్ గా పని చేసి తెలుగు దేశం పార్టీ పార్టీకి 15 సంవత్సరాల పాటు సేవలందించిన స్థానిక ఏకైక సీనియర్ నేత చిట్టిబాబు దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి పెద్ద ఝలక్ ఇచ్చినట్లైంది. అంతంత మాత్రంగా ఉన్న గ్రామ టిడిపికి ఇది కోలుకోని పెద్ద దెబ్బ. ఈ హఠాత్తు పరిణామం ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు ఓట్ల శాతాన్ని గణనీయంగా తగ్గించ గలదు. చిట్టిబాబు చేరికతో వైకాపా బలం మరింత పుంజు కోనున్నది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి చిట్టిబాబు “జనాసవార్త” తో చరవాణీలో మాట్లాడారు. ప్రస్తుతం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీలో పూర్వపు, సీనియర్లకు విలువ లేదని, కేవలం వరుపుల రాజా 2019 లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాలం నుంచి ఏర్పడిన పార్టీ శ్రేణులకు మాత్రమే విలువ, గుర్తింపు ఉందని, తనలాంటి సీనియర్లకు ఆ పార్టీలో ఏ విలువా ఇవ్వడం లేదన్నారు. పైగా ఇటీవల కాలంలో ఆ పార్టీలో చేరిన కొత్త నాయక గణం మాలాంటి సీనియర్లను విమర్శిస్తూ ఉన్నారు అన్నారు. అందుకే ఆ పార్టీలో ఇమడలేక ఆ పార్టీకి సతీ సమేతంగా రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ పంచాయితీ పాలక వర్గ పోటీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నా మన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *