(గుండా బాలమోహన్)
శ్రీకాకుళం – జనాసవార్త
———————————-
శ్రీకాకుళం జిల్లా గ్రామీణ మండలంలోని
పెద్దపాడు గ్రామంలో ఫిబ్రవరి 7న బాల, బాలికలకు కుస్తీ పోటీలో పాల్గొనే ఔత్సాహిక క్రీడా కారుల ఎంపిక జరగనున్నది. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల బాల, బాలికా క్రీడాకారులు తమ తమ ఆధార్ కార్డులతో సహా శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామ పంచాయతీ భవనం వద్దకు ఉదయం ఎనిమిది గంటలకు హాజరు కావాలని పోటీల నిర్వాహక సంఘ అధ్యక్షులు బొట్ట ఆసిరిఅప్పడు, కార్యదర్శి నక్క రామన్న, వ్యాయామ ఉపాధ్యాయులు డా. గుండబాల మోహన్, కుస్తీ పోటీల కోచ్ గోవిందరావు, ఎల్. ఢిల్లీశ్వరరావు సంయుక్తంగా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.