యస్.రాయవరంలో “దేశం” ఎన్నికల ప్రచారం

యస్.రాయవరం – విశాఖ జిల్లా
——————————————-
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మండల కేంద్రం యస్.రాయవరం గ్రామ పంచాయితీ పాలక వర్గంనకు తెలుగు దేశం పార్టీ తరఫున ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు శనివారం ఇంటీంటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయం 8, 12, సాయంత్రం 14, 9 వార్డుల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు కందుల వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి కశింకోట రాంబాబు, వార్డు సభ్యులు కలిసి ఎన్నికల ప్రచారం చేసారు. ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు దుబాసి రమేష్, మురుకుర్తి గణేష్, కర్రి శ్రీనివాసరావు, తాడేల సంతోష్, గాలి దివాణం,తాడేల సూరన్న, భీమరశెట్టి శ్రీనివాసరావు, మద్దాల లక్ష్మణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *