* గొల్లప్రోలు నగర పంచాయతీ వినియోగదారుల సమావేశంలో రాష్ట్ర కన్స్యూమర్స్ ఫెడరేషన్ డిమాండ్

గొల్లప్రోలు – తూర్పు గోదావరి
——————————————
నగర పంచాయతీల్లో ఆస్తి విలువ ఆధారిత పన్నుల విధింపు ప్రభుత్వాలకు తగదని ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గం స్వచ్ఛ గొల్లప్రోలు సంఘ కార్యాలయంలో నగర పంచాయతీ వినియోగదారుల సంఘం సమావేశాన్ని దిమ్మల నారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. రాష్ట్ర వినియోగ దారుల సంక్షేమ సంఘాల సమాఖ్య కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ అధ్యక్షతన ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ముఖ్యఅతిథిగా వినియోగదారుల రక్షణ చట్టం పుస్తక ప్రతులను ఆవిష్కరించా రు. అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల విలువ ఆధారితంగా విధించే మున్సిపల్ ఆస్తి పన్నుల విధింపు జీవోలను రద్దు చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడారు. వినియోగ దారుల్లో చైతన్యం, చట్టం పట్ల అవగాహన వుంటే మోసపోమని ఆయన పేర్కొన్నారు. నగర పంచాయతీల్లో ఈ విధానం వలన పెను భారం ఏర్పడు తుందన్నారు. ఆస్తి పన్నుల పెంపు విధానాలపై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన మార్చి నెలలో గొల్లప్రోలులో పౌర సంక్షేమ ప్రజా సదస్సు నిర్వహిస్తామని రమణరాజు ప్రకటించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాన్ని గొల్లప్రోలు నగర పంచాయతీ వినియోగ దారుల సంఘంగా రూపాంతరం చేసి సంఘ అనుబంధంగా రేట్ పేయర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచిం చారు. మైనారిటీ హక్కుల కమిటీ కన్వీనర్ హాసన్ షరీఫ్ మాట్లాడుతూ వినియోగదారుడు కొనుగోలు చేసే ఆహార వస్తువుల్లో కల్తీలు లేకుండా, తూకంలో మోసాలు జరగకుండా అప్రమత్తత వహించాలన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కన్స్యూమర్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీని వాసరావు మాట్లాడుతూ సంఘటిత చైతన్యం తోనే ప్రగతి సాధ్యమవు తుందన్నారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ అందజేసిన రక్షణ చట్టం పుస్తక ప్రతులను గొల్లప్రోలులోని ప్రజా సంఘాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి సమావేశాన్ని నిర్వహించారు. వివేకానంద జ్ఞాన సమాజం నిర్వాహకులు కొసిరెడ్డి రాజా, పోసిన సూరి బాబు, మొగలి శివప్రసాద్, కొమ్ము. సత్యనారాయణ మూర్తి, బుర్రా ఆంజనేయులు, చింతా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *