(️అరియ నాగసేన బోధి)

రామడుగు మండలం – కరీంనగర్ జిల్లా
——————————————————–
మహారాష్ట్రలోని సెంట్రల్ ఇండియాలోని కొంకణ్ ప్రాంతంలో “ధాబోల్” సమీపంలోని “వణంది” గ్రామంలో 1898 సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన జన్మించారు. చిన్నప్పుడు రమాబాయిని రామీబాయి అని పిలిచేవారు. రమాబాయి తల్లి  మరణించడంతో తండ్రి భికూధూత్రే అతికష్టం మీద తన నలుగురు బిడ్డలను పెంచారు. సముద్ర చేపలను బుట్టలతో మోసే పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బతిని గుండెల్లో నొప్పితో కాలం చేసారు. నలుగురు బిడ్డలు అనాథలు కావడంతో రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే ఆ బిడ్డల సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు. రమాబాయి అక్క గౌరీబాయి, చెల్లెలు మీరాబాయి, తమ్ముడు శంకర్ లు ఉన్నారు. గౌరీబాయికు చిన్నప్పుడే పరిణయం జరిగింది. రమాబాయికి కూడా పరిణయం చేయాలని శంకర్ ధూత్రే చూస్తున్న సమయంలో అంబేడ్కర్ తండ్రి రామ్ జీ సక్పాల్ మాలోజీ కూడా తన తనయుడు అంబేడ్కర్ కు పరిణయం చేయాలని చూస్తున్నారు. అంబేడ్కర్ ను మొదటి సారిగా పాఠశాలలో చేర్చిన ఊరు “ధాబోల్” లో అంబేడ్కర్ కు సంబంధాలను తండ్రి చూస్తుండగా ధాబోల్ పరిసర ప్రాంతాల్లో  రమాబాయి కనబడింది. రమాబాయి గుణగణాలు గమనించిన రామ్ జీ సక్పాల్ మాలోజీ అంబేడ్కర్ కు ఇచ్చి పెళ్ళి చేసారు. ఆ అమ్మపై  పేమతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి పల్నాటి చంద్రయ్య, స్వేరో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జెట్ పెల్లి అనిల్ జవాజి, కరీంనగర్ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్ నాని,  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *