* 12 వార్డు సభ్యునిగా రాజు పోటీ
* ఉప సర్పంచ్ పదవికి ఏకాభిప్రాయం
* దుబాసీల వారసత్వం
* ఆర్టీఐ ఉద్యమ నేతగా సేవలు

శృంగరాయవరం – విశాఖజిల్లా
———————————————-
ప్రపంచంలో అనునిత్యం ఎన్నో దేశాల నాయకుల మధ్య, అధికారుల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతూ వుంటాయి. ఆ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు చరిత్ర గతినే మార్చి వేస్తాయి. అయితే యీ నాయకులందరిదీ ఒకే భాష కాదు. అందుకని వారు ద్విభాషీయులను ఏర్పాటు చేసుకుంటారు. తమ నాయకులకు దగ్గరుండి ఈ ద్విభాషీయులు మాటల అనువాదం చేస్తారు.

దుబాసీల సేవలు నిరుపమానం….
———————————————————-
అమెరికా, రష్యా అధ్యకక్షులు చర్చల్లో పాల్గొనాలంటే రష్యా అధ్యకక్షుడితో బాటు దుబాసీలు వుంటారు. ఈయన రష్యన్‌లో చెప్పిన దాన్ని అవతలి వారికి ఇంగ్లీషులో చెప్పి, వారి సమాధానాన్ని మళ్లీ వీళ్లకు రష్యన్‌ భాషలో అనువదించి చెప్తారు. దుబాసీలు తమ నాయకుల మాటలనే మక్కికి మక్కిగా అనువదించకుండా, వారి భావాలను కూడా స్పష్టంగా వ్యక్తీకరించే సరైన మాటలను వెతికి పొదుగుతారు. వాటిని సరైన అనుభూతితో పలుకుతారు. అప్పుడే ఎదుటి వ్యక్తికి వీరి భావం పూర్తిగా బోధ పడుతుంది. వీరి సహకారంతోనే వివిధ భాషా నిఘంటువులు మన దేశంలో పుట్టుకు వచ్చాయి. కానీ ఈ దుబాసీల పాత్ర ఎప్పుడూ తెర వెనుకనే వుంటుంది.

భాషా అనుసంధానకర్తలు….
—————————————
వీరు ఏదేశీ రెండు భాషల మధ్య ఉంటూ అనువాదం చేస్తారు. గనుక వీరిని మొదటిలో అనుసంధానకర్తగా ద్విభాషీయులు అనేవారు. రాను రాను ఈ పదం దుబాసీలుగా వాడుకలో స్థిరపడింది. ఈ క్రమంలో దుబాసీల వీధులు, కాలనీలు కూడా ఏర్పడ్డాయి. కొంత మంది ఇంటి పేర్లు దుబాసీ అని స్థిరపడింది. దీన్ని బట్టి దుబాసీల సేవలకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది.

దుబాసీ రాజకీయ నేపధ్యం ….
——————————————
ఈ కోవలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖజిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేంద్రం ఎస్.రాయవరం గ్రామంలో దుబాసీ వీధి ఉంది. ఈ పంచాయితీకి 20 సంవత్సరాలకు పైగా
సర్పంచ్ గా దుబాసి అప్పన్న పని చేసారు. ఈ కాలంలో ఆయన తన స్వంత ఆస్తులను కూడా తెగనమ్మి గ్రామాభివృద్ధికి కృషి చేసారు. ఈ స్వర్గీయ మాజీ సర్పంచ్ వారసులుగా ఆయన
కుమారుడు దుబాసి రామకృష్ణ ఎస్.రాయవరం మొదటి యం.పి.టి.సి సభ్యునిగా ఎన్నికై అభివృద్ధి చేసారు. ఈ ఇరువురి తండ్రి, తనయులు దుబాసి అప్పన్న , దుబాసి రామకృష్ణ వారసుడుగా 3 వతరం నాయకుడుగా ఎస్.రాయవరం పంచాయితీ పాలకవర్గంలోని 12 వ వార్డు సభ్యత్వ అభ్యర్ధిత్వానికి సోమిరెడ్డి రాజు
తెలుగు దేశం పార్టీ తరఫున బరిలోకి దిగారు. అంతేకాదు ఈయన ఉప సర్పంచ్ పరుగు పందెంలో కూడా ఉన్నారు.

ప్రజోద్యమకర్త సోమిరెడ్డి రాజు
———————————————–
సోమిరెడ్డి రాజు… ఈ ముద్దు పేరుతో అందరికీ సుపరిచితులు అయిన ఈయన అసలు పూర్తి పేరు సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు. దుబాసీ వంశ మూడో తరానికి చెందిన రాజు ప్రజా ఉద్యమ దిగ్గజం. ఈయన ఎం.కాం, ఆపై ఉన్నత చదువుల విద్యావంతుడు. ఈయన యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ సంస్థ కన్వినర్ గా ఎన్నో ప్రజోద్యమాలును నిర్మిస్తున్నారు. అన్యాయ మైపోయిన ఎందరో బాధితులకు తన వంతు న్యాయం చేస్తున్నారు రాజు.

అంకెల్లో శృంగరాయవరం …
—————————————
శృంగరాయవరం, ఈ మండలానికి కేంద్రం ఇది సమీప పట్టణమైన తుని నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1688 ఇళ్లతో, 6,568 జనాభాతో 660 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగ వారి సంఖ్య 3,233, ఆడవారి సంఖ్య 3,335. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1,094 కాగా షెథడ్యూల్డ్ తెగల సంఖ్య 30. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586481, పిన్ కోడ్: 531060.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *