శ్రీకాకుళం – జనాసవార్త
———————————
రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు పెద్దపాడు పాఠశాల విద్యార్థులు ఎంపిక అయ్యారు. పెద్దపాడులోని మారుతి వ్యాయామ శాలలో ఆదివారం ఉదయం నిర్వహించిన జిల్లా స్థాయి కుస్తీ పోటీల క్రీడాకారుల ఎంపికలో శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు కోరాడ శారద, ఈదు సాయి వారి వ్యక్తిగత బరువు విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. వీరిని  ప్రధాన ఉపాధ్యాయులు మక్క శ్రీనివాసరావు విద్యార్థినీ విద్యార్థులకు, పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు  డా. గుండ బాల  మోహన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈనెల ఫిబ్రవరి 13వ తారీఖున చిత్తూరు జిల్లా  రేణిగుంటలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొంటారు.  ఈ విజయం  పట్ల పాఠశాలలో పనిచేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు  పి.సత్యవతి, యం.శాంతారావు, జి. భూషణ రావు, డిఎం. మల్లేశ్వరి, ఎస్ఎల్ . శివ జ్యోతి, ఏ. మాధవి భాయ్, పీ.వీ.జీ.లక్ష్మి, జె. లలిత, కె. సురేష్, ఆర్ట్ ఉపాధ్యాయుడు సి.హెచ్. రవి కుమార్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుని బి.త్రివేణి,  విద్యార్థులకు అభినందించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *