* 2,016 ఓట్లు భారీ ఆధిక్యం
* 16 కి 15 వార్డులు వైసీపీ కైవసం
* మూడు వార్డులు ఏకగ్రీవం

అన్నవరం – తూర్పు గోదావరి
———————————————-
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పంచాయతీకీ
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో శెట్టిబత్తుల కుమార్ రాజా 2016 ఓట్ల భారీ ఆధిక్యంతో
సర్పంచ్ గా ఘన విజయం సాధించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ ఆశీస్సులతో సర్పంచ్ పోటీలో నిలిచిన కుమార్ రాజా తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో నామినేటెడ్, రాజ్యాంగబద్ద ప్రజా ప్రాతినిధ్య, ప్రభుత్వ పదవులను ఈయన లోగడ అలంకరించి నప్పటికీ అన్నవరంనకు సర్పంచ్ కావాలనే తన చిరకాల వాంఛ ఈ ఎన్నికతో నేరవేరింది. అన్నవరం పంచాయితీ పరిధిలోని 16 కి 15 వార్డులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. కుమార్ రాజా తన సమీప ప్రత్యర్థిపై 2,016 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఒకటవ వార్డు సభ్యుడిగా కొండి సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పాలక వర్గ సభ్యులుగా రెండో వార్డులో సోము వెంకట దుర్గ అచ్యుతాంబ 154, మూడో వార్డులో కొల్లు బాబూరావు 17, నాల్గవ వార్డులో ధారా పార్వతి 105, ఐదో వార్డులో పళ్ళ చక్రం 14, ఆరో వార్డులో తాటిపాక సింధూజ 47, ఏడవ వార్డులో గంపల అన్నవరం 107, ఎనిమిదో వార్డులో ఆశిన శ్రీనివాస్ 56, ఎమ్మిదో వార్డులో బొబ్బిలి వెంకన్న 182, పదో వార్డులో సింగంపల్లి రాము 147 ఓట్ల ఆధిక్యంతో విజేతలయ్యారు. పదకొండో వార్డులో యాళ్ళ భాస్కరరావు, పన్నెండో వార్డులో కొమిరిశెట్టి శ్రీను ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పదమూడో వార్డులో గుల్లా కరుణ కుమారి 162, పద్నాలుగో వార్డులో వెంటూరి మాణిక్యం 20, పదిహేనో వార్డులో పెండ్యాల రూప 83 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. పదహారో వార్డులో సవితాల వీరవెంకట రమణ ఏకగ్రీవముగా ఎన్నికయ్యారు. అన్నవరం గ్రామ సర్పంచిగా ఆధిక్యంతో సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా శెట్టిబత్తుల కుమార్ రాజా మీడియాతో మాట్లాడుతూ విజయానికి అన్ని విధములా సహాయ, సహకారాలు అందించిన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ కు, అన్నవరం గ్రామ ప్రజలకు, పెద్దలకు, ఓటర్లకూ సర్వదా తాను రుణపడి ఉంటానంటూ వారందరికీ తన కృతజ్ఞతలను తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన సాయశక్తులా కృష్ణి చేస్తానని పునరుద్ఘాటించారు. తన విజయాన్ని ఎమ్మెల్యే పర్వత పుర్ణచంద్ర ప్రసాద్ కు అంకితం చేస్తున్నానని తెలిపారు. భారీ ఆధిక్యతతో ఘన విజయం సాదించిన అన్నవరం పంచాయితీ పాలక వర్గ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *