* 14 పంచాయితీలూ వైకాపావే
* మూడు సర్పంచులు ముందే ఏకగ్రీవం
* పోటీలోని 11 పంచాయితీలూ వైకాపావే
* తుడుచు పెట్టుకు పోయిన తెలుగు దేశం
* మండల వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు
* విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు
* గ్రామాభివృద్ధిపై దృష్టి నిలపమన్న ఎమ్మెల్యే

శంఖవరం – తూర్పు గోదావరి
——————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని పంచాయితీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. మండలంలోని అన్ని పంచాయితీల్లోని సర్పంచ్ పదవులూ కండగుత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరిపోయాయి. తెలుగు దేశం పార్టీ నుంచి ఓ ఒక్క సర్పంచ్ కూడా విజయం సాధించలేదు. ఈ ఎన్నికలతో మండలం వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ సర్పంచ్ ప్రజా ప్రాతినిధ్యం తుడుచు పెట్టుకు పోయింది. శంఖవరం పంచాయితీ నుంచి బందిలి గన్నియ్యమ్మ, అచ్చంపేట పంచాయితీ నుంచి బొట్టా చైతన్య, ఎస్. జగ్గంపేట పంచాయితీ నుంచి బైరా ఉప్పారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ లుగా ఏకగ్రీవంగా .ఎన్నిక అయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కొంతంగి సర్పంచ్ గా దూడల రామస్వామి, సీతయ్యమ్మపేట పంచాయితీ సర్పంచ్ గ తోట నాగజ్యోతి, కత్తిపూడి పంచాయితీ సర్పంచ్ గ కొల్లు వెంకట సత్యనారాయణ, నెల్లిపూడి పంచాయితీ సర్పంచ్ గ నరాల సరిత, వజ్రకూటం పంచాయితీ సర్పంచ్ గ సకురు గుర్రాజు, అన్నవరం పంచాయితీ సర్పంచ్ గ శెట్టిబత్తుల కుమార రాజా, మండపం సర్పంచ్ గ కూనిశెట్టి మాణిక్యం, గౌరంపేట సర్పంచ్ గ రామిశెట్టి ఏసుబాబు, గొంధి కొత్తపల్లి పంచాయితీ సర్పంచ్ గా ఈగల విజయదుర్గ, వేళంగి పంచాయితీ సర్పంచ్ గ మేకల సుబ్బయ్యమ్మ, పెదమల్లాపురం పంచాయితీ సర్పంచ్ గ గూడెం నాగదేవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈ విజేతలు అందరూ వారి విజయానందంలో వారి, వారి పంచాయితీల పరిధిలో విజయోత్సవ భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం వారు ఊరేగింపుగా మండలం కేంద్రం శంఖవరంలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ స్వగృహానికి చేరుకున్నారు. మర్యాద పూర్వకంగా ఆయనను కలసి ఆయనకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఇక గ్రామాల్లో అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆ 14 మంది సర్పంచులు, అందరు వార్డు సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *