* చిరుద్యోగిపై రాజమండ్రి ఏసీబీ పెద్ద వల
* రూ. 5 000 లంచంతో పట్టుపడ్డ ములగపూడి వీఆర్వో దేవత 
* గతంలో కూడా రూ. 40,000 లంచం అడిగారట 

(విలేకరి కట్టు అప్పారావు)

ములగపూడి – తూర్పుగోదావరి
——————————————-
ఆన్ లైన్ భూముల వివరాల వెల్లడికి ఓ లెక్క  …
భూమి యాజమాన్యం పేర్ల నవీకరణ లేదా మార్పు లేదా “మ్యూటిషన్ కు ఇంకొక లెక్క … భూముల “వన్ బి కి “ఇంకో లెక్క… ” అడంగల్ లకు మరింకో లెక్క … రోజువారీ సెటిల్మెంట్లకు కూడా ఓ లెక్క …. తాను పాటిస్తున్న ఇన్ని రెవెన్యూ ఆమ్యామ్యా లెక్కల నడుమ ఆ మహిళా వీఆర్వో లెక్కలను మాత్రం ఏసీబీ అధికారులు గురువారం పక్కాగా తేల్చేశారు. 

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
రౌతులపూడి మండలం ములగపూడి గ్రామం వీఆర్వో భూర్తి దేవత రూ. 5000 లంచం తీసు కుంటూ రాజమండ్రి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయారు. ములగపూడి గ్రామం 209 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిని ఏ అన్నవరం గ్రామానికి చెందిన బుర్ర కృష్ణమ్మ తండ్రి వెంకన్న పేరున 1971 సంవత్సరంలో కొన్నారు. ఆయన మరణం అనంతరం వారి వారసులైన బుర్ర నాగబాబు (తండ్రి సూరిబాబు) పేరున మార్పు (మ్యూటిషన్) చేయడానికి ములగపూడి వీఆర్వో దేవత రూ. 7,000  లంచంగా నాగబాబును అడుగగా ఆయన లంచం ఇవ్వలేక.  రాజమండ్రి ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ సొమ్ము రూ. 5 000 ను నాగబాబు ద్వారా  పంపిన ఏసీబీ అధికారులు నిగూఢంగా వల పన్నారు. ఆమె ఆ రూ. 5,000 లంచంగా  తీసుకుంటూ రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ రామచంద్ర రావు, ఏసీబీ సీఐ తిలక్, ఎస్ ఐ నరేష్ తదితర అధికారులు పట్టుబడ్డారు. “భూ “దారి కోసం మండల సర్వేయర్ కు రూ. 40,000 లనను ఇవ్వాలని చెప్పి గతంలో తనను వీఆర్వో దేవత సొమ్ములు అడిగారని ఈ సందర్భంగా నాగబాబు ఏసీబీ అఅధికారులకు ఫిర్యాదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *