నెల్లిపూడి – తూర్పు గోదావరి
——————————————–
భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన గంటా బాలుదొర నియమితులు అయ్యారు. పార్టీ విస్తరణ, పార్టీ అంత్యోదయ్ సిద్ధాంతం ప్రకారం చిట్టచివరి పౌరుని వరకూ ప్రభుత్వ అభివృద్ధి స్థలాలను అందించే ప్రక్రియలో తాను ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తాను అని ఈ సందర్భంగా బాలుదొర మీడియాతో అన్నారు. పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతానని, దేశం, ధర్మం కోసం పనిచేస్తానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమూవీర్రాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులకు బాలుదొర కృతజ్ఞతలు తెలుపారు. ఆదివారం పత్రికా ప్రకటనలో బాలుదొర తెలుపారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *