* పాలక వర్గానికి అడుగడుగునా బ్రహ్మ రధం
*పార్టీలో కొత్తగా చేరిన ఉత్సాహ వంతులు
* సర్పంచ్ మాణిక్యంకు మంగళ హారతులు

మండపం – తూర్పు గోదావరి
————————————-
శంఖవరం మండలం మండపం పంచాయితీ పాలకవర్గం తమ విజయోత్సవ జనప్రదర్శనను ఆదివారం నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ అనూచరుడు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కూనిశెట్టి మాణిక్యం ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్ గా 547 ఓట్లు ఆధిక్యతతో విజేతయ్యారు.

పంచాయితీ పరిధిలోని మండపం, కొండ గౌరంపేట, శివారు తాళ్ళపాలెం గ్రామాల్లో 12 వార్డులు ఉన్నాయి. వీటిలో వరుసగా 1 నుంచి 10 వార్డులకు వరుసగా చందక అర్జునుడు, తాటికొండ సూర్యకాంతం, వేల్పుల సత్యవతి, నక్కా సత్తిబాబు, కామిరెడ్డి నల్లబాబు, వండ్రు సత్యవతి, దాసరి పంపాదమ్మ, పోలం నాగఅనంతలక్ష్మి, గట్టెం లక్ష్మి ఎన్నిక అయ్యారు. వీరందరూ కల్సి ఐదో వార్డు సభ్యులు నక్కా మాణిక్యంను ఉపసర్పంచ్ గ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పాలక వర్గం ఈ రోజు సాయంత్రం 3 గంటలకు భారీ జన ప్రదర్శనను నిర్వహించారు. ఈ ర్యాలీ సర్పంచ్ ఇంటి దగ్గర నుండి మొదలై మూడూళ్ళలోనూ వ్యాన్ లో ర్యాలీగా జనంలోకి వెళ్ళి తమ విజయానికి కారకులు అయ్యిన ఓటర్లు, మిగతా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మార్గం మధ్యలో మహాత్మాగాంధీ, భారత రత్న అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అడుగడుగునా ప్రజలు పాలక వర్గానికి బ్రహ్మ రధం పట్టారు. కొందరు మహిళలు హారతులు ఇచ్చారు. ఈ ఆనందో త్సాహంలో మరి కొందరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి కొత్తగా ఆహ్వానించారు. వీరికి సర్పంచ్, పాలక వర్గం పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే పర్వత ప్రోత్సాహంతో ఈ గ్రామానికి సర్పంచ్ గా కూనిశెట్టి మాణిక్యం ఎన్నిక కావడం ఇది మూడో సారి కావడంతో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ భారీ జన ప్రదర్శనలో పరాజిత వార్డు సభ్యులు చాగంటి అప్పారావు, చాగంటి సూర్యకాంతం, ముఖే వీరబాబు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *