కాకినాడ – జనాసవార్త
————————————-
భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్
జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడుగ ఐనవెల్లి సుధీర్ బాబు నియమితులు అయ్యారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నియామక పత్రం జారీచేశారు. తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఇటీవల తమ కార్యకర్తలు, నేతలకు పార్టీ నియామక పదోన్నతులను కల్పించారు.

తూర్పు గోదావరి జిల్లా నుంచి మొత్తం 34 మందికి వివిధ పదోన్నతులను కల్పించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు ఆమోదించిన ఈ పదవులను పొందిన వారిలో ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరం నుంచి యువ కార్యకర్త ఐనవెల్లి సుధీర్ బాబు కుడా ఉన్నారు. ఈయన జిల్లా కేంద్రం కాకినాడలో నివాసం ఉంటున్నారు.

ఈయన 2013లో భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా చేరారు. 2015 చివరి వరకూ ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఆ మలి సంవత్సరం 2016 లో సుధీర్ బాబును కాకినాడ టౌన్ అధ్యక్షునిగా నియమించింది. 2020 వరకూ ఆ పదవీ బాధ్యతల్లో సుధీర్ బాబు అందించిన సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ సుధీర్ బాబుకు పదోన్నతిని కల్పించారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడుగ ఐనవెల్లి సుధీర్ బాబును నియమించారు.

పార్టీ విస్తరణ, పార్టీ అంత్యోదయ్ సిద్ధాంతం ప్రకారం చిట్ట చివరి పౌరుని వరకూ ప్రభుత్వ అభివృద్ధి స్థలాలను అందించే ప్రక్రియలో తాను ప్రభుత్వానికి, పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తానని ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో అన్నారు. పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతానని, దేశం, ధర్మం కోసం పని చేస్తానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులకు సుధీర్ బాబు కృతజ్ఞతలను తెలిపారు. తనకు ఈ పదవిని కట్టబెట్టినందుకు పార్టీకి విధేయులుగా ఉంటూ పేద ప్రజలు, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి పని చేస్తానని సుధీర్ బాబు సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

తనను గుర్తించి పదవి ఇచ్చినందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేటుకూరి సూర్య నారాయణ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ఇంఛార్జి రేలంగి శ్రీదేవి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు తోట సర్వా రాయుడు, రాష్ట్ర మిడియా ప్రతినిధులు ఎనిమి రెడ్డి మాల కొండయ్య, రవికిరణ్, బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, మిత్రులు, ,శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *