శంఖవరం – తూర్పు గోదావరి
——————————————
గిరిజన ప్రభుత్వోద్యోగులు 83 మందికి కరోనా నివారణా టీకాలను వేసారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెదమల్లాపురం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజన ప్రభుత్వోద్యోగులు 83 మందికి మండల కేంద్రం శంఖవరంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఈ టీకాలను వేసారు. పెదమల్లాపురం ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు లలితారాణి నేతృత్వంలో సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లకు మొదటి దఫా టీకాలను వేసారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కీటకాలను వేయించు కోవడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే ఆ టీకాలను వేయించు కోడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంఖవరం మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జె.రాంబాబు కల్పించుకుని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చక్కని అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులే వినియోగించు కోకపోతే ఎలా…? ప్రభుత్వ లక్ష్యం మేరకు కరోనా ఫ్రంట్ లైన్ సిబ్బంది అందరూ ఈ కరోనా టీకాలను వేసుకోవాల్సిందేనని, లేని పక్షంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరే బాధ్యత వహించాలని ఎంపీడీవో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకాలు వేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చారు. అత్యధికంగా 83 మంది టీకాలను వేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *