* మార్చి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
* మార్చి 10 న ఎన్నికలు
* 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికలు
* జెడ్పీటీసీ, ఎంపీటీసీలపై రాని స్పష్టత
* పట్టణ ప్రాంతాల్లో మొదలైన ఎన్నికల సందడి

అమరావతి – జనాసవార్త
—————————————–
ముందు నుండీ భావిస్తునట్టుగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ నే ఎస్ఈసీ కొనసాగించ నున్నది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఎస్ఈసీ కొనసాగించ నున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. గతంలో స్క్రూటినీ వరకు వచ్చాక ఈ ప్రక్రియ ఆగింది. ఇక ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం మార్చి 2, 3 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. ఇక మార్చి 10న పోలింగ్ ఉండ నుంది. అలానే మార్చి 14న ఫలితాలు వెలువడ నున్నాయి. విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎన్నికలు జరగ నున్నాయి. అయితే నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్లకు ఎన్నికలు ఉండవు. కోర్టు కేసుల కారణంగా నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికలకు దూరంగా ఉండ నున్నాయి. పాత నోటిఫికేషన్ కొనసాగిస్తూ ఉండడంతో కొత్త మున్సిపాల్టీలకు కూడా ఎలక్షన్స్ లేవు.”

అంతా ఊహించినట్టుగానే మరో ఎన్ని కకు రంగం సిద్ధమైంది. పంచాయితీ ఎన్ని కలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించింది . తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను సోమ వారం విడుదల చేసింది. గతంలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన చోట నుంచే తిరిగి కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయడం
జరిగింది. మార్చి 10 న పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటన విడు దల చేసి. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడనుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చి 3 న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయిం చారు. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. గత ఏడాది మార్చి 23 న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15 న వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉప సంహరణ దశ లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్ని కల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్ని కలు నిర్వహిస్తోంది . వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ తాజాగా నిర్ణ యించింది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం ఇప్పటికే ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పురపాలక సంఘాల ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు మార్గం సుగమం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు సర్కార్ తరఫున ఎన్నికలకు సుముఖంగా ఉన్నట్టు ఎస్ఈసీకీ లిఖిత పూర్వకంగా తెలియ జేశారు. ఫలితంగా ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందడుగు వేసింది. అంచనాలకు తగ్గట్టుగానే సోమవారం మున్సి పల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉత్కంట…
———————————————————-
అయితే జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్ర భుత్వం ఎన్నికలకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో ఉత్కంట కొనసాగుతోంది. జడ్పిటిసీ, ఎంపీటీసీలకు సంబంధించి జరిగిన ఏకగ్రీవాలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి . పూర్తి స్థాయిలో దౌర్జన్యం కాండ చెలరేగిందనే విమర్శలను ప్రతిపక్ష పార్టీలు చేశాయి. ఫలితం గానే అప్పట్లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి ఇదే రకమైన డిమాండ్ వచ్చింది. దీంతో జడ్పి టిసి, ఎంపిటిసిలకు ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అనే విషయమై మీమాంస నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఒకవేళ ఏకగ్రీవాలను రద్దు చేసిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంతో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలతో తల నొప్పి తప్పదనే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. అయితే దీనికి సంబంధించి మరో ఐదారు రోజుల్లో స్పష్టత ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. అందువల్లనే ఎన్నికలకు సంబంధిం చిన వివరాలను తెప్పించుకొని తీవ్రంగా పరిశీలించడం జరుగుతోంది.

కాగా మార్చి 10 న రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో కూడా అంతటా ఎన్నికల సందడి నెలకొంది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను, అక్కణ్నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్తగా ఆశావహులకు నిరాశే మిగిలింది. కొత్తగా షెడ్యూల్ వస్తే అప్పట్లో నామినేషన్లు దాఖలు చేయని వారు కూడా ఈసారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారు ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఇంత కాలం ఎదురు చూశారు. మార్చి 8 న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును ఎస్ఈసీ విధించగా నాలుగో తేదీన ఎంత మంది పోటీలో ఉన్నది తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *