కాకినాడ – తూర్పు గోదావరి
—————————————–
భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంటు జిల్లా కార్యదర్శిగా కాకినాడ అర్బన్ నియోజక వర్గానికి చెందిన గౌరి యెర్రమిల్లీ (అవసరాల) నియమితులు అయ్యారు. సామాజిక కార్యకర్త, హిందూ సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు మక్కువతో విశేష కృషి చేస్తున్న గౌరి సేవలను గుర్తించిన కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చిలుకురి రామ్ కుమార్ ఈ మేరకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. హిందూ రాష్ట్ర శక్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నో సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహింస్తున్న గౌరి యెర్రమిల్లీ తనను పార్టీ బాధ్యతలు అప్పగించిన సందర్భంగా స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. తనను జిల్లా పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాజకీయాలను తను ఒక సేవగా మాత్రమే పరిగణిస్తానని తెలిపారు. ఆమె తాత బీహెచ్. బాలకృష్ణ జన సంఘ సంస్థ వ్యవస్థాపక సభ్యులు అని, ఎమర్జెన్సీ కాలంలో జైలులో గడిపిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), భారతీయ జనతా పార్టీ (భాజపా) కార్యకర్త అని, చిన్నప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాల వాతావరణం లో పెరిగినందున నందున “నేషన్ ఫస్ట్” అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తానని ఆమె చెప్పారు. తనకు ఈ పదవీ బాధ్యతల అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ కుమార్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
