Tue. Mar 9th, 2021

* కాకినాడ పిఆర్. గవర్నమెంట్
ఒకేషనల్ జూనియర్ కళాశాలలో..

కాకినాడ – తూర్పు గోదావరి
——————————————-
నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీదేవి 142 వ జయంతిని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పిఆర్. గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాస రచన పోటీలలో విజేతలు, కళాశాల ప్రతి గ్రూపులోనూ టాపర్గ్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులను పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పితాని రాము చేతుల మీదుగా బహుమతులను బుధవారం అందజేసారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్ వి. పల్లేశ్వరరావు మాట్లాడుతూ నేటి తరంలో యువత సరోజినీదేవి వంటి నేతలను, మహాత్ములను ఆదర్శంగా తీసుకుని భావి తరాలకు బంగారు బాట వేయాలని విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.తిరుపతిరెడ్డి, ఎన్ఎస్ఎస్. ఉపాధ్యాయులు కే.నిరంజన్ కుమార్, పివీఎస్ శివప్రసాద్, కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *