* అడుగడుగునా బ్రహ్మరధం పట్టిన ప్రజలు
* మహిళల మంగళ హరతుల ఘనస్వాగతం
* బ్యాండ్ బాజా సందడి చేసిన కుర్రకారు
* కృతజ్ఞతా పర్యటనలోనూ ప్రజల విజ్ఞప్తులు

(యాత్ర నుంచి జనాస)

అన్నవరం – తూర్పు గోదావరి
———————————————-
న్నవరం గ్రామ పంచాయితీ నూతన పాలక వర్గం తమ విజయయాత్ర కృతజ్ఞతా పర్యటనను నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం అన్నవరంలో ఉదయం 9 గంటలకు కొత్తపీటలో ప్రారంభమై ఆంధ్రాబ్యాంక్, ఎస్పీ సామాజిక వర్గాల కాలనీ, రైల్వే స్టేషన్ మీదుగా వెలంపేట, పెరికీపేట, పెద్ద మార్కెట్, రాఘవేంద్ర రోడ్డుకు మధ్యాహ్నం 1గంట వరకూ ఈ జైత్రయాత్ర సాగింది. అక్కడే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భోజనాలు అయ్యాక మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ యాత్రను కొనసాగి కాలనీ మీదుగా బ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ కాలనీలను
సాయంత్రం వరకూ సుమారు 12 కీలోమీటర్ల పొడవునా అత్యంత ఘనంగా సాగింది.

గ్రామ ప్రజలు, ఓటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అందరూ పాలక వర్గానికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకన్నబాబు ఏకగ్రీవ ఒకటవ వార్డు సభ్యుడు కొండి సూరిబాబు, రెండో వార్డు సభ్యురాలు సోము వెంకటదుర్గ అచ్యుతాంబ, మూడో వార్డు సభ్యులు కొల్లు బాబూరావు, నాల్గవ వార్డు సభ్యురాలు ధారా పార్వతి, ఐదో వార్డు సభ్యుడు పళ్ళ చక్రం, ఆరో వార్డు సభ్యురాలు తాటిపాక సింధూజ, ఏడవ వార్డు సభ్యులు గంపల అన్నవరం, ఎనిమిదో వార్డు సభ్యులు ఆశిన శ్రీనివాస్, తొమ్మిదో వార్డు సభ్యులు బొబ్బిలి వెంకన్నబాబు, పదో వార్డు సభ్యులు సింగంపల్లి రాము, పదకొండో వార్డు సభ్యులు యాళ్ళ భాస్కరరావు, ఏకగ్రీవ పన్నెండో వార్డు సభ్యులు కొమిరిశెట్టి శ్రీను, పదమూడో వార్డు సభ్యురాలు గుల్లా కరుణకుమారి, పద్నాలుగో వార్డు సభ్యులు వెంటూరి మాణిక్యం, పదిహేనో వార్డు సభ్యురాలు పెండ్యాల రూప, ఏకగ్రీవ పదహారో వార్డు సభ్యులు సవితాల వీరవెంకటరమణ సంయుక్తంగా రెండు వాహనాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ విజయ జైత్రయాత్ర చేసారు.

యాత్ర పొడవునా పాలక వర్గం జననీరాజనం అందుకుంది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. విజేతలకు విజయ తిలకం దిద్ది, సుమంగళ హారతులు ఇచ్చి పాలక వర్గ సభ్యులను మహిళా మణులు దీవించారు. పూర్ణాయుష్షు, ఆరోగ్యం ప్రాప్తించాలని శుభా ఆశీస్సులు పలికారు. పాలక వర్గానికి ఎల్లెడలా ఘన స్వాగతం లభించింది. బాణ సంచా శబ్ద హోరు బ్యాండ్ బాజా జోరు సంగీతంతో కుర్రకారు సందడి చేసి యాత్రకు వన్నె తెచ్చారు. ఈ కృతజ్ఞతా పర్యటనలో కూడా ప్రజలు తమ ప్రియతమ నేతలకు పలు విజ్ఞప్తులు చేసారు. అనంతరం స్థానిక ఓ ప్రైవేట్ లాడ్జ్ లో సర్పంచ్ కుమార్ రాజా స్థానిక మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *