కరోనా టీకాల గైర్హాజరుకు షోకాజ్ నోటీసులు

శంఖవరం, 21ఫిబ్రవరి 202
——————————————

కరోనా టీకాలను వేయించు కునేందుకు గైర్హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ షోకాజ్ నోటీసులను ఇస్తామని శంఖవరం ఎంపీడీవో జె.రాంబాబు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోని మండల ప్రజా పరిషత్తు కార్యిలయంలో ప్రభుత్వోద్యోగులకు కరోనా నివారణా మొదటి డోసు టీకాలను వేయడం తోపాటు ఈ సిబ్బందికి అవగాహనా కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించారు. శాంతిఆశ్రమం, రౌతులపూడి, శంఖవరం, రావికంపాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలోని శంఖవరం మండల పంచాయితీ ఉద్యోగులు, సచివాలయాల సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్లకు కలపి మొత్తం 67 మందికి కరోనా టీకాలను వేసారు. మరికొందరు ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజన విరామ సమయం ముందు సీబ్బందిని ఉద్దేశించి ఎంపీడీవో రాంబాబు మాట్లాడారు. కరోనా టీకాలను వేసుకోవాలని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ టీకాలను వేసుకోవడానికి చేస్తున్నందున జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం తప్పనిసరి చేస్తూ ఆదేశించారని, ఈ విషయం తెలుసుండి కూడా ప్రభుత్వ ఉద్యోగులు గైర్హాజరయ్యారు రావడంపై షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఒక్కో టీకాకు రూ. 3,000 ఖరీదు అవుతుందని, ఈ విధంగా రెండు డోసుల టీకాలను ప్రభుత్వం ఉచితంగా వేస్తోంటే ఆ టీకాలకు ఫ్రంట్ లైన్ వారియర్సే వెనుకంజ వేయడం ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కార్చడమేనని ఆయన అన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తున్న దరిమిలా టీకాలకు సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం క్షమించదనీ ఎంపీడీవో రాంబాబు అన్నారు. టీకాలను వేసుకున్న అందరి వివరాలను అంతర్జాలంలో నమోదు, అర్ధ గంట పరిశీలన అనంతరం లబ్దిదారులను ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో శంఖవరం ఆస్పత్రి వైద్యులు ఆర్వీవీ. సత్యనారాయణ, బాలాజీ, పెదమల్లాపురం ఆస్పత్రి వైద్యురాలు లలితారాణి, ఈవోపీఆర్డీ. విశ్వనాథ్, శంఖవరం ఆస్పత్రి సీహెచ్ఓ. కృష్ణవేణి, హెచ్వీ. వీరలక్ష్మి, శంఖవరం ఆస్పత్రి, సచివాలయాల ఏఎన్ఎమ్ లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *