అన్నవరం, 21 ఫిబ్రవరి 2020
————————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజాను స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసి యేషన్ సభ్యులు అభినందించారు. కుమార్ రాజా అన్నవరం గ్రామసర్పంచ్ గా ఎన్నికై
తన చిర కాల వాంఛను నేరవేర్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని శెట్టిబత్తుల కుమార్ రాజాను ఆయన స్వగృహంలో ఆదివారం సాయంత్రం వర్కింగ్ జర్నలిస్ట్స్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయనకు శాలువా కప్పి, పూల మాల వేసి సత్కరించి అభినందించారు. సర్పంచ్ ప్రతిస్పందిస్తూ గ్రామాభివృద్ధి విషయంలో తనకు పాత్రికేయులు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ సహకరించాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు యాళ్ల శివ, సత్తి బాలకృష్ణ మూర్తి నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
