శంఖవరం, 21 ఫిబ్రవరి 2021
—————————————-
మాఘమాసాన్ని పురస్కరించుకొని శంఖవరంలోని శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం సాయి కుమార్ శర్మ, మణికంఠశర్మ విఘ్నేశ్వరునికి భక్తులతో పూజలను చేయించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి, స్వామి ఐదు కథలను భక్తులకు వివరించారు. ఈ వ్రతం వలన భక్తులకు దుఃఖాలు తొలగి ధన ధాన్య అభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. భక్తులకు ఆలయ వ్యవస్థాపకులు దాసరి లోవరాజు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి బాబ్జి, బొర్రా శ్రీను, వెలుగుల రాంబాబు, రేలంగి సత్తిబాబు, జట్లా రాము, లచ్చ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *