* శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు గుండు లక్ష్మీదేవి పిలుపు

శ్రీకాకుళం పట్టణం – జనాసవార్త
———————————————
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ తన ఉనికిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా నా నియోజకవర్గంలోని శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాల్లో ఆ ఉనికిని కాపాడు కోవడం చాలా సంతోషం అని మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. మునుపు ఎన్నికలలో ఎప్పుడూ మాకు మద్దతు పలికే మత్స్యకారులను దూరం చేసే ప్రయత్నంలో మత్స్యకారులను ఎస్టిలో చేర్చాలనే ఒక అలజడిని తీసుకొచ్చి కలెక్టరేట్ దగ్గర ఎస్సీ మత్స్యకారులు ఒకరిపై ఒకరు తమపై తామే తిరగబడే పరిస్థితి కల్పించారు. మత్స్య కారులను ఎస్టిల్లో చేర్చే అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని, కానీ దీనికి భిన్నంగా మత్స్య కారులను మభ్య పెట్టే మోసం జరిగిందని ఆమె తెలిపారు. తిరిగి మత్స్యకార గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేయడం చాలా సంతోష కరమని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే మండల ఎన్నికల్లో కూడా మన ఉనికిని కాపాడు కోవటానికి మన తెలుగు దేశం కేడరు, తెలుగు దేశం పార్టీ అభిమానులు కలిసి కట్టుగా పని చేయాలని శ్రీకాకుళం నియోజక వర్గం మాజీ శాసన సభ్యురాలు గుండు లక్ష్మీదేవి పిలుపు ఇచ్చారు. ఆమె తెలిపారు. తిరిగి మత్స్యకార గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేయడం చాలా సంతోష కరమని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే మండల ఎన్నికల్లో కూడా మన ఉనికిని కాపాడు కోవటానికి మన తెలుగు దేశం కేడరు, తెలుగు దేశం పార్టీ అభిమానులు కలిసి కట్టుగా పని చేయాలని శ్రీకాకుళం నియోజక వర్గం మాజీ శాసన సభ్యురాలు గుండు లక్ష్మీదేవి పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *