ఎస్.రాయవరం – విశాఖ జిల్లా
——————————————–
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ని మండల కేంద్రం ఎస్.రాయవరం గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకుడిగా సొమిరెడ్డి రాజు ఎన్నిక అయ్యారు. మంగళవారం రాత్రి స్థానికంగా జరిగిన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యస్.రాయవరం గ్రామ టీడీపీ పార్టీ నాయకుడిగా సొమిరెడ్డి రాజును అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామ తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోపం వల్ల ఇబ్బందులు పడు తున్నామని, ముందుకు ఏకతాటిపై నడిపే నాయకుడు అవసరం ఎంతైనా ఉన్నదని నాయకులు, కార్యకర్తలు వాపోయారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో జరిగిన తప్పిదాలను, పొరపాట్లు రాబోవు మండల పరిషత్, జడ్పీటీసీ ఎన్నికలలో ఏ విధంగా అదిగమిoచాలో ఆలోచనలు, ప్రణాళికలు ముందుగా నూతన నాయకత్వం తయారు చేసుకొని గెలుపు దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా వక్తలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సొమిరెడ్డి రాజు మాట్లాడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, అన్ని కార్యక్రమాల్లోను కార్యకర్తలను ముందుండి నడిపిస్తానని సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా సొమిరెడ్డిని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో బత్తుల వాసు, మురుకుర్తి గణేష్, కర్రి అబద్ధం, భీమరశెట్టి సత్యనారాయణ, నాగ సూరిబాబు, దుబాసి రమేష్, అంకాబత్తుల రమణ, అంగిన రమణ, బత్తుల సూరన్న, తాడేల సంతోష్, కర్రి శ్రీనివాసరావు, 13 వ వార్డ్ సభ్యులు గాలి సత్యనారాయణ, కశింకోట రాంబాబు, సూర్య ప్రకాష్, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *