* ముహూర్తం కోసం తహ తహ
* సమావేశాలే తప్ప తీర్మానాల్లేవ్
* నిధుల్లేక అభివృద్ధికీ ఆటంకాలే
* విజయం మొక్కులూ ఆలస్యం
* ఎంపీటీసీ ఎన్నికలే అసలు కొర్రీ

శంఖవరం, 24 ఫిబ్రవరి 2021
———————————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పంచాయితీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ పాలక వర్గాల ప్రమాణ స్వీకారాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వక పోవడంతో విజేతలు ఎదురు తెన్నులు చూస్తూన్నారు. ఈ పదవుల ప్రమాణ స్వీకార శుభ మూహర్తం కోసం సర్పంచులు, ఉప సర్పంచులు తహతహ లాడుతున్నారు. ఈ లోగా పాలక వర్గాలు ఆయా పంచాయితీల్లో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ వాస్తవ పరిపాలనా అధికారం చట్టబద్ధంగా పాలక వర్గాల చేతికి రాక పోవడంతో ఆ నిర్ణయాలను పంచాయితీ తీర్మానాల రూపంలోకి తీసుకుణజ రాలేక పోతున్నారు. అందువల్ల ఉన్న పంచాయితీ సాధారణ నిధులతోనైనా అత్యవసర అభివృద్ధి చేసే అధికారం పాలక వర్గాలకు లేకుండా పోయింది. పాలక వర్గాలు అమలులోకి రాకపోవడం వల్ల అభివృద్ధికి నిధుల ప్రతిపాదనలను చేసి ఆ మేరకు నిధులు కావాలంటూ ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల్లో అది చేస్తాం… ఇది చేస్తాం … అంటూ వాగ్దానాలు ఇచ్చారు. కానీ వాటి అమలుకు బోణీ కొట్టే మార్గం కనపడ్డం లేదు. ఇక కొత్తగా పాలకవర్గాల దృష్టికి ఎవరేనా ప్రజా సమస్యలను తీసుకు వస్తే పాలకవర్గం ప్రమాణ స్వీకారం అయ్యాక చేస్తాం అంటూ వాయిదా వేయాల్సి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో 13 జిల్లాలు, 670 మండలాల్లో నాలుగు దఫాలుగా జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడి విజేతల వివరాల ప్రకటన, ఆ మేరకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేయడం, విజేతలు విజయ యాత్రలూ పూర్తి అయ్యాయి.
అయినా పాలకవర్గాల ప్రమాణ స్వీకారాన్ని ఎన్నికల సంఘం చేయించ లేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇంకా రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికలు ఇంకా జరగ వలసి ఉన్నది. ఈ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయితేనే తప్ప పాలక వర్గాలు ప్రమాణానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే పంచాయితీలకు పాలకవర్గాల ప్రమాణ సీవకారానికి అనుమతి ఇచ్చి , ఆపై ఎంపీటీసీ ఎన్నికలు జరిపి ఆ తరువాత వారి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తే చట్టపరమైన సరికొత్త సాంకేతిక సమస్యలు ఎదురు అవుతాయి. పంచాయితీ రాజ్ చట్టంలోని ఒక నిబంధన ప్రకారం జరుగుతున్న ఈ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో సాంకేతిక అంశాల దృష్ట్యా విడివిడిగా అమలులోకి వస్తున్నప్పటికీ ఆయా పంచాయితీలు, మండల పరిషత్తుల పాలక వర్గాలు మాత్రం వేర్వేరు తారీఖుల్లో అమలులోకి రావడం చట్టబద్ధంగా వీలు కాదు. చట్టాన్ని తోసిరాజని వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే ఈ రెండు స్థానిక సంస్థల కోసం చట్టాలకు సవరణ చేయాల్సి ఉంటుంది. సవరణలతో నిమిత్తం లేకుండా అనుమతిస్తే కోర్టు వ్యాజ్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి వ్యాజ్యాలలో ఎంపీటీసీలు, సర్పంచులకు విడి విడిగా తీర్పులు ఇవ్వవలసి వస్తుంది. అందుకు మాదిరి కరమైన ఆధార పూర్వకమైన పూర్వపు తీర్పులను కోర్టులు ఉటంకించలేవు. అందువల్ల రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని వ్యాజ్యాలు ఉన్నప్పటికీ ఆ ఎన్నికలు పూర్తి అయ్యాకే ముందుగా ఎన్నికైన సర్పంచులు, దీనికంటే ముందే నామినేషన్ల ఉపసంహరణతో కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిన ఎంపీటీసీ ఎన్నికలు తాజాగా పూర్తయ్యాకే రెండు స్థానిక సంస్థల పాలక వర్గాలూ ఒకేసారి అమలులోకి రానున్నాయి. అంత వరకూ ముందుగా ఎన్నికైన పంచాయితీ పాలక వర్గాలు వేచిచూడ వలసిందే. ఆ తదుపరి ప్రమాణ స్వీకారాల తరువాతనే మొక్కలు చెల్లించు కోవలసి ఉంటుంది.

జర్నలిస్ట్ జనాస / శంఖవరం 

9492 961961 / 7793 961961

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *