శంఖవరం, 26 ఫిబ్రవరి 2021
———————————————-
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరంలోని శ్రీ సమర్థ సద్గురు సాయినాథ స్వామి ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ధర్మకర్త అంకం శ్రీనివాసరావు, ప్రభాకుమారి దంపతులు తెలిపారు. శ్రీ చాంద్రమాన, స్వస్తిశ్రీ శార్వరినామ సంవత్సరం మార్గశిర బహుళ పాడ్యమి 28 నుంచి మార్చి 1 సోమవారం వరకూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. 28 న మధ్యాహ్నం 2 గంటలకస్వామి వారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తా అన్నారు. 1 న సోమవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, వరుసగా పుణ్యాహవచనం, 108 కలశాలతో పూజ, అనంతరం సత్యసాయి వ్రతాలు, అన్నదానాన్ని నిర్వహిస్తా మన్నారు. ఆలయాన్ని నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయ్యిందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కోసం స్వామి వారి దివ్య గోపుర కలశంపై 108 కళాశాల (బిందెలతో) పంచనది జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *