* పెట్రోల్, గ్యాస్, పెంపుతో సామాన్యుడికి భారం
* సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు

(గుండా బాలమోహన్, 94922 65697)

శ్రీకాకుళం, 28 ఫిబ్రవరి 2021
———————————————–

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నిత్యావసర వస్తువు పై అడ్డు అదుపు లేకుండా ధరలు పెంచుకుంటూ పోతుందని దీంతో సామాన్యుడు బతుకు భారంగా మారుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. ట్రేడర్స్ నా భారత్ బందు పిలుపుకు సంఘీభావంగా స్థానిక రామలక్ష్మణ కూడలి వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం సామాన్యుడి అనుకూలమని చెబుతూనే సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతుందని, పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిందని, మధ్య తరగతి సామాన్య ప్రజలు బండి తీయాలంటే భయపడుతున్నారని, గ్యాస్ బండ పై కూడా 20 రోజుల వ్యవధిలో సుమారు వంద రూపాయలు పైగా ధరలు పెరిగాయని ఇది సామాన్యులకు పెనుభారం అన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల సంపదను పెంచేందుకు సామాన్యుడి నడ్డి విరిచేందుకు ఏ ఈ ధరల పెరుగుదల అని, ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, ఆదనీ వంటి కార్పొరేట్ వ్యక్తుల చేతిలో పెట్టిందని, మునుముందు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేయడమే బిజెపి జండా గా తయారయిందని విమర్శించారు. పెట్రోల్ ధర పెరుగుదల వల్ల ప్రతి వస్తువు పై కూడా భారం పడుతుందని సామాన్యుడు సామాన్యుడు తినే ప్రతి వస్తువు పైన కూడా రెట్టింపు ధరలు అన్నారు. పెంచిన ధరలను తగ్గించడమే కాకుండా పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్ ధర తగ్గుతుందని, భారతదేశ అభివృద్ధి చెందుతున్న పాలకులు అభివృద్ధి చెందిన దేశాలలో పెట్రోల్ ధర 50 రూపాయల లోపే ఉంటే మనదేశంలో వంద రూపాయల పైగా అమ్మడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తరిమికొట్టే వరకూ పోరాటాలు అగవని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిక్కాల గోవిందరావు, శ్రీకాకుళం నియోజకవర్గ కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, నగర కన్వీనర్ డోల శంకర్రావు, సిపిఐ నాయకులు పట్టణ ప్రసాదు, ఎచ్చర్ల రవి, శ్రీను, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కలగ తులసి, అప్పన్న, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *