* ఆలయ ప్రథమ వార్షికోత్సవం

శంఖవరం, 28 ఫిబ్రవరి 2021
——————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని శ్రీశ్రీశ్రీ విజయ కనక దుర్గమ్మ గ్రామోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వస్తిశ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ శుద్ధ పాడ్యమి ఆదివారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను  నిర్వహించారు. ఉదయం 6 గం॥లకు అమ్మ వారి దేవాలయ వార్షికోత్సవాన్ని దైవజ్ఞలు భక్తి శ్రద్ధలతో  నిర్వహించారు. 7-00 గం॥లకు విఘ్నేశ్వర పూజ, తర్వాత వరుసగా పుణ్యాహవాచనం, గోపూజ, అష్టోత్తర కలశారాధన, 108 కలశాలతో పుణ్య స్త్రీల గ్రామోత్సవం, అమ్మ వారి మహా కుంభాభిషేకం, పంచామృతాఅభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, లక్ష కుంకుమార్చన, చండీహోమం, కమలపుష్ప హోమం, రుద్రమారం, నవగ్రహ హోమం, మహాపూర్ణాహుతి, ఆశీర్వచనం, మంగళ హారతి, చతుర్వేద స్వస్తి భజనలు చేసారు.

దీనికి ముందు రోజు స్థిరవారం (శనివారం) సాయంత్రం 4-00 గంటలకు విఘ్నశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షా బంధనం పంచగవ్యప్రాసన, దీక్షా ధారణ, ఋత్తికవరణ, మండపారాధన, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలను ఆలయ నిర్మాణ సలహదారులు ఇవటూరి ప్రసాద్, గ్రామ పురోహితులు ద్వివేదుల వెంకట సత్య జగన్నాధం, ఆలయ పూజారి ద్వివేదుల వెంకటకృష్ణసుబ్రహ్మణ్య సూర్యనారాయణ నిర్వహించారు. యావన్మంది భక్తులు విచ్చేసి ఈ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించి తరించారు. స్థానిక ది కత్తిపూడి లారీ ఓనర్స్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే , ప్రభుత్వ హమీల పర్యవేక్షణ కమిటీ సభ్యులు పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్, పంచాయితీ సర్పంచ్, కొల్లు వెంకట సత్యనారాయణ, ఉప సర్పంచ్ గౌతు నాగు, ఆలయం వ్యవస్థాపకులు గౌతు అర్జుబాబు, ఆలయక కమిటి సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *