శంఖవరం, 11 మార్చి 2021

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరంలోని శ్రీ పార్వతీ మల్లేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పండిత సదస్యం (సత్కారం) నిర్వహించారు. ఈ ఆలయం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం నకు ధత్తత ఆలయం కావడంతో అన్నవరం దేవస్థానం వేద పండితులు సిహెచ్.శివరామశర్మ , జి.గంగబాబు, వైవిఆర్ఎస్.శర్మ స్వామి, అమ్మ వార్ల వైభవాన్ని వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేసారు. స్వామి, అమ్మ వార్ల కొనియాడారు. వారి వైభవాన్ని భక్తులకు శ్రవణానంద కరంగా వివరించారు. ఆలయ అర్చకులు రాంపల్లి బ్రహ్మానందశర్మ, కుమార్ శర్మ, సుబ్రహ్మణ్యశర్మ ప్రత్యేక పూజలు చేసారు. అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం పాలక వర్గం మాజీ సభ్యులు, వైసిపి నేత పర్వత రాజబాబు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పర్వత శతృఘ్నుడు, రేలంగి రామారావు, జట్లా లచ్చారావు, కుసుమంచి కోటిబాబు, రంగా వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *