శంఖవరం, 14 మార్చి 2021.
——————————————-
అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ గంధం చంద్రుడుని పనికి మాలిన వాడు అని దరుసుగా మాట్లాడం మంచి పద్దతి కాదని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అంబేద్కర్ ఇండియన్ మిషన్ సమన్వయకర్త గునపర్తి అపురూప్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి తన స్థాయిని మరచి దిగజారి అనాగరికంగా మాట్లాడడాన్ని
అపురూప్ ఖండించారు. వైకాపా పరిపాలనలో దళితలకు రక్షణ లేదని, వెంటనే కేతిరెడ్డిని అరెస్ట్ చేయాలని అపురూప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు అపురూప్ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *