* 20 లో 18 వార్డులు వైసిపి కైవసం 
* రెండు వార్డులకే పరిమితమైన టిడిపి
* తెదేపా కోటపై వైకాపా జెండా రెపరెపలు

(జర్నలిస్ట్ మూర్తి )

గొల్లప్రోలు – తూర్పు గోదావరి
—————————————-
గొల్లప్రోలు నగర పంచాయతీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నగర పంచాయితీలోని
20 వార్డుల ఓట్ల లెక్కింపును ఆదివారం నిర్వహించారు. వైసిపి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు అత్యధికంగా 18 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అధికార వైకాపాకు ప్రధాన ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. టిడిపి చైర్పర్సన్ అభ్యర్థిని నాగిని చంద్ర స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందడం ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదేపల్లి వినీల్ వర్మ సైతం భారీ తేడాతో ఓటమి చెందడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. వైసిపి నుంచి 1వ వార్డులో గంధం నాగేశ్వరరావు, 3 వార్డులో మైనం భవాని, 4 వ వార్డులో బెందుకుర్తి సత్తిబాబు, 5 వ వార్డులో దమ్మాల లక్ష్మి, 6 వ వార్డులో గొల్లపల్లి అచ్యుతాంబ, 7వ వార్డులో మొగలి వెంకట జయలక్ష్మి, 8 వ వార్డులో సింగం నాగేశ్వరరావు, 9వ వార్డు లో తెడ్లపు అలేఖ్యరాణి, 10వ వార్డులో మొగలి దుర్గాఆనందరావు, 11వ వార్డులో కూరాకుల శేఖర్, 13 వ వార్డులో వడిసెల అనంతలక్ష్మి, 14 వ వార్డులో దాసం దేవి, 15 వ వార్డులో గంటా అప్పలస్వామి, 17వ వార్డులో గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, 18వ వార్డులో గండ్రేటి
మంగతాయారు, 19 వ వార్డులో వల్లభదాసు అనంతలక్ష్మి, 20 వ వార్డులో పున్నం మంగాలక్ష్మి విజయం సాధించారు. టిడిపి తరఫున 2వ వార్డు లో లింగం సునీత, 12 వ వార్డులో గొల్ల సుబ్బారావు గెలుపొందారు. ఈనెల 18న నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గా గండ్రేటి మంగతాయారును ఎన్నుకో నున్నారు. అయితే వైస్ చైర్మన్ గా ఎవర్ని ఎన్నుకుంటారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా నగర పంచాయతీని తిరుగులేని మెజార్టీతో వైసిపి కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో విజయోత్సవం చేసు కుంటున్నాయి. మొత్తం మీద మునుపటి తెదేపా కోటపై వైకాపా జెండా రెపరెపలాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *