ఒంగోలు – ప్రకాశం జిల్లాa
———————————–
ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలులో అమరజీవి పొట్టి శ్రీరాములు జన్మ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ… త్యాగ మూర్తి, నిస్వార్ధ రహితంగా తెలుగు మాట్లాడే వారందరికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, భాషా ప్రయోక్త రాష్ట్రాలకై తన ప్రాణాలపై ఇసుమంతైనా ధ్యాస లేకుండా ఆమరణ నిరాహారదీక్షనుచేసి, 58రోజుల పాటు నిరాహారులై, మంచి నీటిని సైతం త్యజించి తుదకు ప్రాణాలను అర్పించిన మహోన్నతుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఎవరి కోసం ఆ ఆత్మార్పణ చేశారు? అనే చిన్న విషయాన్ని ప్రతీ పౌరుడూ గుర్తిస్తే శ్రీరాములు త్యాగానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తారని, మనం ఇప్పుడు వారిని తలంచకపోతే భవిష్యత్తులో మన పిల్లలకు ఇంతటి మహాత్ముల గురించి తెలియ చెప్పే వారుండరని, కనుక కుల మతాలకు అతీతంగా, స్వార్ధ రహితుడైన గాంధీజీ శిష్యరికంలో అహింసా మార్గంలో పయనించిన అమృత మూర్తి పొట్టి శ్రీరాముల జయంతి, వర్ధంతులకైనా ఆయనను మన స్మృతి పథంలో నిలుపు కోవాలని ప్రజలకు జంధ్యం విజ్ఞప్తి చేశారు. శ్రీరాములు ఆర్య వైశ్యులైనందుకు మనందరం గర్వించాలి. ఊరు కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఒక్కొక్కరు ఒక్కోవిధముగ తమ జీవితాలను త్యాగం చేసిన మహాత్ములు స్వామి వివేకానంద, మహాత్మాగాంధీజి, పొట్టి శ్రీరాములు, వీరిందరిని అనుసరిస్తూ మనం ముందుకు సాగాలని మరో వక్త కొలిశెట్టి అంకమ రావు మనవి చేశారు.

ఈ కార్యక్రమములో వాసవి విద్యానిధి కార్యదర్శి నూనె రామాంజనేయులు, ఎయిమ్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు శెనెగెపల్లి నాగాంజనేయులు, ధనిశెట్టి రాము, మద్దాలి శివప్రసాద్, మరియు కొలిశెట్టి అంకమ రావు, యం. కృష్ణ ప్రసాద్, కె. హేమచంద్ర, జి. హరీష్, కె. మణికుమార్, ఐ బాలసాయి, కె. వెంకటేశ్వర్లు, పివి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *