* విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
* రూ .100 కోట్ల మేర నిధుల పెంపు
* ప్రపంచంతో పోటీపడే పరిస్థితి పేద పిల్లలకు రావాలి
* జగనన్న విద్యాకానుకలో కొత్తగా డిక్షనరీ
* పిల్లలు ప్రతి రోజూ ఒక పదం నేర్చుకోవాలి
* పట్టణాలతో సమానంగా పల్లెల్లో విద్యాబోధనుండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిఅమరావతి, 16 మార్చి 2021 :
———————————————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఫలితంగా గతంలో కన్నా భిన్నంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నాడు – నేడు వంటి కార్యక్రమాలతో పాటు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఈక్రమంలో ప్రాధమిక విద్యపై ప్రభుత్వాల ఆలోచనలు మార్చారు. ప్రాథమిక స్థాయిలోనే పిల్లల సమగ్ర వికాసానికి వేసే బాటలు విద్యార్థికి బంగారు భవిష్యత్తుతో పాటు దేశానికి మేలు చేస్తాయని సంకల్పించి, ఆదిశగా అడుగులు వేస్తున్నారు. పునాది స్థాయిలో విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు . ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి పేద పిల్లలకు రావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష పిల్లలను గొప్పగా చదివించాలని , వారి భవిష్యత్ అందంగా తీర్చిదిద్దాలని , తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలనే తల్లిదండ్రుల కలను ప్రభుత్వం నెరవేర్చాలని ముఖ్యమంత్రి సంకల్పించారు . తదనుగుణంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు . రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు , మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా జగనన్న విద్యా కానుక వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారి విద్యా భ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది . అందులో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి అనుకున్నదే తడవుగా ఒక అడుగు ముందుకేశారు . ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా కానుకలో కొత్తగా డిక్షనరీని చేర్చారు . విద్యార్థులకు డిక్ష నరీ ఇవ్వడం , డిక్షనరీని ఎలా చదవాలో చెప్పాలను కోవడం ఇదే ప్రథమం . రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఇంగ్లీష్ బోధన మెరుగుపర్చడంతో పాటు , విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వీలైన వాతావరణం కల్పిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు . డిక్షనరీ ఉపయోగం ఎక్కు వగా ఉంటుంది కాబట్టే దాని నాణ్యత కూడా బాగుం డాలని అధికారులను ఆదేశించారు . వైఎస్సార్ ప్రీ ప్రైమ రీ స్కూళ్లలో ఇంగ్లిష్- తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడా లని , ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలుచేయాలని సీఎం సూచించారు . ఇంగ్లిష్ రాకుంటే ఎన్ని నైపుణ్యాలున్నా వృథానే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో చిన్న ప్పటి నుంచే ఇంగ్లిష్ను నేర్పించాలని , అందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలని నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టణ , గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద , ధనిక అనే తారతమ్యం చూప కుండా ప్రతి ఒక్కరికీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు . ప్రస్తుత కాలంలో ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడి నుంచి ఉన్నత విద్య వరకు విప్లవా త్మక మార్పులు చేపట్టారు. భవిష్యతను తీర్చిదిద్దే నిలయం విద్యాలయంలో అంకురార్పణ చేశారు . ఇంగీ ప్లో చదువుకొని భవిష్యత్ లో ఉన్నత స్థానాలు అందు కుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్థామతకు మించి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి అప్పుల పాలవు తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తే అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు , ఇంగ్లిష్ నైపుణ్యాలు లభిస్తాయని ఆలోచించి ఇంగ్లీష్ మీడియం విద్యకు ముఖ్యమంత్రి జగన్ బాటలు వేశారు . ఒక స్థాయి దాటాక ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ ఒంట బట్టకపోవడం , చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ చదువులు చదివిన వారితో పోటీపడలేక కుంగిపోవడం , ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వల్ల విస్తృత ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది . జగ నన్న వసతి దీవెన , జగనన్న విద్యాదీవెన ద్వారా ఉన్నత విద్యకు తోడ్పాటునందిస్తున్నారు . రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు 2021 – 22 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పథ కాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల విద్యాశాఖకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిం ది . ఈ పథకం అమలుకు ఈసారి దాదాపు రూ .100 కోట్ల మేర నిధులు పెంచింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *