కర్రివానిపాలెం – విశాఖపట్నం జిల్లా
—————————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం మండల కేoద్రం యస్.రాయవరం గ్రామ పంచాయతీ సరిహద్దు కర్రివానిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 132-2 లో  4.26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊట చెరువు (వరహా నది) గర్భంలో ఇటీవల నిర్మించ తల పెట్టిన యస్.రాయవరం గ్రామ పంచాయతీకి మంజూరైన గ్రామ సచివాలయం-2, రైతు భరోసా కేoద్రం, వెల్ నెస్ సెంటర్ అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర హైకోర్ట్ W.P. 379 ఆఫ్ 2021 స్టేటస్ కో మంజూరు చేసింది.

అయితే హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిషేధ స్థలంలో మంగళవారం (16.03.2021) రాత్రి 11 గంటల సమయంలో   గ్రామ ఉప సర్పంచ్ భర్త కర్రి పెదబ్బాయి ఆద్వర్యంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్మశానంనకు పోవు సిమెంట్ రోడ్డు మధ్యలో అక్రమంగా ప్రహారి గోడ నిర్మాణం చేపట్టారు. ఇది కోర్టు ఆదేశాలను దిక్కరించడమే. వైస్సార్ నాయకుల దుందుడుకు చర్యలు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ బి.సత్యనారాయణ, పంచాయతీ తదితర అధికారులకు యస్.రాయవరం మండలం ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్  సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *