కర్రివానిపాలెం, 17 మార్చి 2021
———————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం
కర్రివానిపాలెంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను 24 గంటలు కూడా గడవక ముందే తొలగించారు. గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్రామ ఉప సర్పంచ్ భర్త కర్రి పెదబ్బాయి ఆద్వర్యం లో వైస్సార్ నాయకులు శ్మశానంకు పోవు సిమెంట్ రోడ్డు మధ్యలో ప్రహారి గోడ నిర్మాణంను ఎట్టకేలకు తహసీల్దార్ బి.సత్యన్నారాయణ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ఏ.వి.యస్.యస్.ప్రసాద్ స్వయం పర్యవేక్షణలో తన సిబ్బందితో మొత్తం ప్రహారి గోడను తొలగించారు. అధికారులు వెంటనే స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ బి.సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితర అధికారులు తక్షణం సమస్యను పరిష్కరించడం పట్ల కన్వీనర్, ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం సోమిరెడ్డి రాజు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *