గొల్లప్రోలు, 18 మార్చి 2021
—————————————-
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం
గొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంనకు ప్రత్యేక అతిథిగా దొరబాబు విచ్చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలు వైసిపి గెలుచు కోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గొల్లప్రోలులో 20 వార్డులకు 18 వార్డులను వైసీపీ గెలుచు కోవడం హర్షణీం అన్నారు. విజేతలైన కౌన్సిలర్లు తమ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్థా నన్నారు. కౌన్సిలర్ మొగలి వెంకట జయలక్ష్మికి పార్టీ పరంగా తగిన గుర్తింపు ఇవ్వవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన అధికారి హరిహరనాథ్, కమిషనర్ పి. సాయి బాబు, చైర్మన్ గండ్రేటి మంగతాయారు, వైస్ చైర్మన్ తెడ్లపు అలేఖ్యరాణి, కౌన్సిలర్లు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, గంటా అప్పలస్వామి, మొగలి దొరబాబు, కూరాకుల శేఖర్, దమ్మాల లక్ష్మి, మైనం భవాని, మాజీ జెడ్పిటిసి పాము సూర్యారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అనిశెట్టి వెంకట సుబ్బారావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు జ్యోతులు భీముడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *