* నూత‌‌న కార‌క్య‌వ‌ర్గానికి ఇంట‌క్‌ జాతీయ అధ్య‌క్షుడు గుర్రం అభినంద‌న‌

విశాఖ‌ప‌ట్నం, 21 మార్చి 2021
————————————————
విశాఖ ఉక్కు ప్రైవేటు ప‌రం చేయొద్దంటూ ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న ప్ర‌జా ఉద్య‌మానికి ర‌క్ష‌ణ‌ రంగానికి చెందిన సీఈయూనియ‌న్ ఆఫ్ ఎస్‌బీసీ (ఏటీవీపీ) త‌న సంఘీభావాన్ని తెలిపింది. ఈ మేర‌కు ఆదివారం కూర్మ‌న్న‌పాలెం జంక్ష‌న్ ఉక్కు స్థూపం వ‌ద్ద జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రైన‌ ఐ.ఎన్‌.టి.యు.సి. (ఇంట‌క్‌) జాతీయ అధ్య‌క్షులు డాక్ట‌ర్ గుర్రం సంజీవ రెడ్డి, జిల్లా ఇంట‌క్ అధ్య‌క్షుడు భోగ‌విల్లి నాగ‌భూష‌ణం, ఉక్కు ఇంట‌క్ అధ్య‌క్షుడు మంత్రి రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రుల స‌మ‌క్షంలో యూనియ‌న్ ప్ర‌తినిధులు త‌మ మ‌ద్ద‌తు తెలిపా‌రు. ఎస్‌బీసీలో ర‌క్ష‌ణ‌రంగ పౌర ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌లు ఇంట‌క్ నాయ‌కులు వివ‌రాల‌డిగి తెలుసు కున్నారు. కార్మిక స‌మ‌స్య‌ల‌పై యూనియ‌న్ మెమోరాండం స‌మ‌ర్పించింది. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌గు విధ‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఇంట‌క్ జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ గుర్రం సంజీవ రెడ్డి హామీ ఇచ్చారు. కార్మికుల ప‌క్షాన మొక్క‌వోని దీక్ష‌తో ప‌నిచేయాల‌ని నూత‌న కార్య‌వ‌ర్గానికి ఆయ‌న అభినంద‌న‌లు తెలియ‌జేసి నిర్మాణాత్మ‌క‌మైన ప‌లు సూచన‌లి చ్చారు. సీఈయూనియ‌న్ ఆఫ్ ఎస్‌బీసీ (ఏటీవీపీ) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్ష‌డు పంత‌గ‌డ భీమారావు, గౌర‌వాధ్య‌క్ష‌డు ఎన్‌.వై.ఎస్‌.ఎన్ రెడ్డి, ప్ర‌‌ధాన కార్య‌ద‌ర్శి ఎ.చంద్ర‌శేఖ‌ర్‌, ఉపాధ్య‌క్షుడు పీఎంఎం వెంక‌ట రావు, యూనియ‌న్ ప్ర‌తినిధులు హుస్సేన్‌, యేసుర‌త్నం త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు.

ఫొటో రైట‌ప్ :
యూనియ‌న్ ఆఫ్ ఎస్‌బీసీ(ఏటీవీపీ) నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులను అభినందిస్తున్న ఐఎన్‌టీయూసీ(ఇంట‌క్‌) జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ గుర్రం సంజీవ రెడ్డితో సీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *