* రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి
* సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి 

చెన్నై , 29 మార్చి 2021
———————————-
ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు శస్త్ర చికిత్స జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్‌ ఆపరేషన్లు నిర్వహించారు. ఐసీయూ నుంచి నేడు వార్డుకు తరలించారు. ఈ క్రమంలో మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్‌ విడుదల చేశారు. ఇది వరకే ఆమెకు ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా, ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుట పడుతోందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *