* గుంటూరులో టీకా వేయించు కోనున్న సీఎం

అమరావతి, 29 మార్చి 2021
——————————————–
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఏప్రిల్ 1 న గుంటూరు నగరంలో ఆయన టీకా వేయించుకో నున్నారు. అమరావతి రోడ్డులోని 140 వ వార్డు సచివా లయం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది . గురువారం ఉదయం 11.10 గంటలకు సీఎం జగన్ ఇక్కడకు చేరుకుని పేరు నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత 11.25 గంటలకు వ్యాక్సిన్ వేయించు కుంటారు. తర్వాత నిబంధనల ప్రకారం వైద్యుల పర్యవేక్షణలో అర గంట పాటు అక్కడే ఉంటారు. వాస్తవానికి రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన సమయంలో కూడా సీఎం మాస్క్ పెట్టుకోలేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ తన పక్కన ఉన్నవారు, మంత్రివర్గ సహచరులు, తన పేషీ అధికారులు మాస్క్ లు పెట్టుకున్నప్పటికీ ఆయన మాస్క్ పెట్టుకోవాలన్న విషయీ మాత్రం పట్టించు కోలేదు. సీఎం మాస్క్ ధరించి కనిపించిన సంద ర్భాలు చాలా అరుదు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కరోనా టీకా వేయించు కోవాలని నిర్ణయించు కోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెంకడ్ వేవ్ పై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ స్వయంగా ముఖ్యమంత్రి టీకా తీసు కుంటే ప్రజల్లో వ్యాక్సిన్ పై అవగాహన పెరుగుతుందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకా వలన కలిగే దుష్పరి ణామాలపై కూడా ప్రజల్లో నెలకొన్న భ్రమలు తొలిగి పోతాయని భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సిన్ వేయించుకునేందుకు అందరూ ముందుకొస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.

నగర, పట్టణ సారధులకు దిశానిర్దేశం …
—————————————————–
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత సీఎం జగన్ గుంటూరు నుంచి తాడేపల్లిలోని అధికారిక నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం విజయవాడకు బయల్దేరుతారు. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో గెలిచి, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు వైస్ చైర్ పర్సన్లుగా పదవీ బాధ్యతలను స్వీకరించిన వారికి విజయవాడలోని ఏ -1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమంలో సీఎం. పాల్గొంటారు. అక్కడ వారికి దిశానిర్దేశం చేసి తిరిగి అధికారిక నివాసానికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *