*శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుని స్పష్టీకరణ

శంఖవరం, 09 ఏప్రిల్ 2021
—————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత శ్లీపూర్ణచంద్ర ప్రసాద్ కు శంఖవరంలోని ఆయన స్వగృహంలో కరోనా నివారణా టీకాను శంఖవరం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందే వేసారని గురువారం జరిగిన ప్రచారంలో నిజం లేదని సంబంధిత వైద్యులు ఆర్వీవీ. సత్యనారాయణ శుక్రవారం భేషరతుగా ఖండించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వంటి వారే ఆస్పత్రులకు వెళ్ళి కరోనా టీకాలు వేయించు కుంటుండగా ఈ ఎమ్మెల్యేకు మాత్రం తన ఇంట్లోనూ, అందునా ప్రజలకు వైద్యాన్ని అందించాల్సిన సమయాన్ని, టీకాను ఎమ్మెల్యే ఇంట్లో వినియోగిస్తూ శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది విధుల దుర్వినియోగానికి పాల్పడ్డా రంటూ విద్యుత్ ప్రసార మాధ్యమాలు చేసిన ప్రచారాన్ని వైద్యుడు దృష్టికి తీసుకుని వెళ్ళగా వివరణ ఇచ్చారు. తమ శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఎవరూ ఎమ్మెల్యేకు కరోనా టీకా వేయలేదని, ఆ వేసినట్టుగా చెబుతున్న టీకా కూడా తమ ఆస్పత్రికి కాదని, మొత్తంగా ఆ విషయానికీ తమ ఆస్పత్రికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన ఖండించారు. ఎమ్మెల్యే అన్న పర్వత సత్యనారాయణమూర్తి దంపతులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ దంపతులు, మిగతా పెద్దలు, ఉద్యోగులు ఎవరైనా తమ ఆస్పత్రికి వస్తేనే కరోనా నివారణా టీకాలను వేసామే తప్ప ఏ ఒక్కరి ఇంటికీ
వెళ్ళి తమ సిబ్బంది మాత్రం నేటి వరకూ ఎవరికీ టీకాలు వేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకే విధులను నిర్వహిస్తున్నామని శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆర్వీవీ. సత్యనారాయణ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *