* 11 మందిలో హైరిస్క్ గుర్తింపు
* ఒకరికి రక్త హీనత గుర్తింపు

శంఖవరం, 9 ఏప్రిల్ 2021
—————————————
మహిళా మూర్తులు గర్భం దాల్చింది మొదలుకొని సుఖప్రసవం అయ్యే వరకూ కొందరిలో అప్పుడప్పుడూ కనిపించే హైపర్ టెన్షన్(హై రిస్క్) పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం ప్రభుత్వాస్పత్రి వైద్యులు బాలాజీ పేర్కొన్నారు. గర్భణీలలో హైరిస్క్ ను ఎప్పటి కప్పుడు గుర్తించాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. ప్రతి నెల 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షా అభియాన్ పథకంలో భాగంగా నిర్వహించే బీపీ, గుండె, షుగర్, రక్త, గర్భస్థ తదితర పరీక్షలను శుక్రవారం ఆయన నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొదటి సారి గర్భం ధరించిన 14 మందిని, రెండోసారి గర్భం ధరించిన 10 మంది, మూడో సారి గర్భం దాల్చిన ముగ్గురిని, నాలుగు అంతకన్న ఎక్కువ గర్భం ధరించిన ఒకరు చొప్పున మొత్తం 28 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలను ఆయన నిర్వహించారు. పరిక్షల ఫలితంగా వీరిలో 11 మందికి హైరిస్క్, ఒకరికి రక్త హీనత ఉన్నట్లు ఆయన నిర్ధారించారు. పరిక్షల అనంతరం గర్భీలకు మందులు, అల్పాహారంగా బిస్కత్తుల పొట్లాలను అందించే సందర్భంగ తన సిబ్బంది, గర్భిణులను ఉద్దేశించి వైద్యులు బాలాజీ మాట్లాడారు. గర్భిణీల్లో హై రిస్కు ఉన్న వారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించడంతో పాటు వారికి, మిగతా గర్భిణీ స్త్రీలకు కూడా అన్ని రకాల వైద్య సేవలను సంపూర్ణంగా అందించాలని ఆయన ఆదేశించారు. అలాగే గర్భిణీలు నిర్దిష్ట పరిమాణంలో రోజూ అవసరమైనన్ని సార్లు పోషకాహారం తీసుకునేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పర్యవేక్షించాలని వైద్యులు బాలాజీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో గర్భిణులకు నిత్యం మెరుగైన గృహ వైద్య సేవలను ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందించాలని వైద్యుడు బాలాజీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ. కృష్ణవేణి, హెచ్.వీ. వీరలక్ష్మి, ఎంపీహెచ్ఈఓ. మల్లికార్జునరావు, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *